Sandeep Lamichhane: అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానేకు కాస్త ఊరట లభించింది. 22 ఏళ్ల లమిచానేకు నేపాల్ పఠాన్ కోర్టు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు నెలల తర్వాత అతడికి విముక్తి లభించింది. అయితే, ఈ కేసులో అంతిమ తీర్పు వెలువడేంత వరకు దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.
కాగా అత్యాచార ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబరు 8న నేపాల్ కోర్టు.. లమిచానేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదంటూ, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ లమిచానే చెప్పుకొచ్చాడు. కానీ, విచారణ పూర్తయ్యేంతవరకు అతడిని సస్పెండ్ చేస్తూ నేపాల్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా అరెస్టయ్యే సమయానికి అతడు నేపాల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఆడుతున్న సమయంలో ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో వెస్టిండీస్ నుంచి నేపాల్‌కు వచ్చాడు.
చదవండి: Delhi vs Andhra: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే... ఢిల్లీ దీటైన జవాబు
Comments
Please login to add a commentAdd a comment