IND vs NEP Asia Cup 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. మనతో మాట్లాడుతున్న వాళ్లు ఎలాంటి వారో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ విమర్శిస్తున్నారు. నీలాంటి స్టార్లు ఇలాంటి పని చేసే ముందుకు ఒక్కసారైనా ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు.
అండగా అభిమానులు
అయితే, హిట్‌మ్యాన్ అభిమానులు మాత్రం.. ‘‘యువ ఆటగాడిని ప్రోత్సహించే క్రమంలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించినా తప్పేనా?’’ అని ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఆసియా కప్-2023లో గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా.. సోమవారం నేపాల్‌తో తలపడిన విషయం తెలిసిందే.
శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, వర్షం ఆటంకం కలిగించిన కారణంగా వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసిన రోహిత్ సేన డీఎల్‌ఎస్ పద్ధతిలో విజయం సాధించింది.
ఊహించని సర్‌ప్రైజ్
ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మ్యాచ్‌లో నేపాల్.. టీమిండియాతో తలపడటం ఇదే తొలిసారి. ఇలా మొదటిమ్యాచ్‌లోనే పటిష్ట భారత జట్టుకు సవాల్ విసిరిన పసికూనకు.. టీమిండియా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లి మెడల్స్‌తో సత్కరించారు. ఈ క్రమంలో.. నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి తన జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సిగ్గుపడు రోహిత్
ఇది గమనించిన నెటిజన్లు.. ‘‘సిగ్గుపడాలి రోహిత్ శర్మ.. జీవితంలో నువ్వు చేసిన చెత్త పని ఇదే అనుకుంటా! నువ్వసలు మా కెప్టెన్‌వే కాదు’’ అంటూ ట్రోల్ చేశారు. కాగా సందీప్ లమిచానేపై అత్యాచార(మైనర్‌పై) ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో అతడు అరెస్టయ్యాడు కూడా!
అయితే, స్థానిక కోర్టు షరతులకు లోబడి బెయిల్‌పై విడుదలైన సందీప్‌పై నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం ఎత్తివేయగా.. స్కాట్లాండ్, నమీబియాలతో ట్రై సిరీస్ నేపథ్యంలో క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో నమీబియా, స్కాట్లాండ్ ఆటగాళ్లు మ్యాచ్ ముగిసిన తర్వాత సందీప్‌నకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా.. నిరసన వ్యక్తం చేశారు.
వాళ్లకు ఉన్న బుద్ధి నీకు లేదు
మహిళలపై హింస, లింగవివక్షకు వ్యతిరేకంగా అతడికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయం గురించి సందీప్‌నకు నేపాల్ క్రికెట్ బోర్డు ముందే చెప్పగా.. అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అలాంటిది.. ఇప్పుడు రోహిత్ శర్మ ఏకంగా అతడితో ఫొటోలు దిగడం సహా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం క్రికెట్ అభిమానులకు నచ్చడం లేదు. రోహిత్ లాంటి స్టార్లు ఇలాంటి వ్యక్తులతో సన్నిహితంగా కనబడటం పరోక్షంగా వారిని ప్రోత్సహించినట్లే అవుతుందని మండిపడుతున్నారు. కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. 74 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం
Sandeep Lamichhane taking Indian Captain Rohit Sharma's autograph on his shirt.
— CricketMAN2 (@ImTanujSingh) September 5, 2023
- The Hitman always there for youngsters - The Icon! pic.twitter.com/SOq7LSAgLk
what a shame ... someone tell Rohit about him
— Ishaan (@Ishaan_s8) September 5, 2023
Virat refused to shake hands with him but Rohit js shamelessly posing with this rape accussed.
— Avishek Goyal (@AG_knocks) September 5, 2023
Even minnow scottish players are of better standard than Rohit Sharma.
Shame.
Comments
Please login to add a commentAdd a comment