ఆసియాకప్-2023లో టీమిండియా సూపర్-4లో అడుగుపెట్టింది. సోమవారం క్యాండీ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్ తలా మూడు వికెట్లు సాధించగా.. షమీ, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. నేపాల్ బ్యాటర్లలో ఆసిఫ్ షేక్(58) అర్ధ సెంచరీ సాధించగా.. సోంపాల్ కామి(48), కుశాల్ భుర్తేల్(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం వర్షం కారణంగా డకవర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74) శుబ్‌మన్ గిల్(67) ఆజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక భారత్ సూపర్-4 దశకు చేరడంతో సెప్టెంబర్ 10న పాకిస్తాన్‌తో మరోసారి తలపడనుంది.
రోహిత్ శర్మ అరుదైన ఘనతలు..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.ఆసియాకప్ టోర్నీలో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు ఆసియాకప్‌లో 10 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(9) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ తన 250వ సిక్స్ మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్ మూడో స్ధానంలో నిలిచాడు.
చదవండి: Asia Cup 2023: నేపాల్ చిత్తు.. సూపర్-4కు భారత్
5️⃣0️⃣ for @ImRo45! 👏👏
— Star Sports (@StarSportsIndia) September 4, 2023
The #TeamIndia skipper has been a sight for sore eyes, marrying elegance & power to bring up a beautiful half century!
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvNEP #Cricket pic.twitter.com/Y9T3erXfmh
Comments
Please login to add a commentAdd a comment