క్యాచ్ పట్టిన తర్వాత రోహిత్ శర్మ రియాక్షన్ (PC: MI ‘X’)
Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కీలక సమయంలో నేపాల్ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత రోహిత్ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆసియా కప్-2023లో రెండో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు.. పల్లెకెలె వేదికగా సోమవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఆరంభంలో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ సులభమైన క్యాచ్‌లను వదిలేశారు.
చెత్త ఫీల్డింగ్ వల్లే.. వాళ్లు రెచ్చిపోయారు
దీంతో లైఫ్ పొందిన నేపాల్ ఓపెనర్లు కుశాల్ భుర్తాల్(38), ఆసిఫ్ షేక్(58) మంచి స్కోర్లు సాధించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదం వారి పాలిట వరంగా మారిందనడంలో సందేహం లేదు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఈ మేరకు స్కోర్ చేశారంటే అది మన చెత్త ఫీల్డింగ్ వల్లేనని అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. క్యాచ్ పట్టేసిన రోహిత్ శర్మ
నేపాల్ ఇన్నింగ్స్ 20వ ఓవర్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ పౌడేల్ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బ్యాక్‌ఫుట్ షాట్ ఆడబోయి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఈ సింపుల్ క్యాచ్‌ను ఒడిసిపట్టేసిన టీమిండియా సారథి సంబరాల్లో మునిగిపోయాడు.
రోహిత్ పట్టిన క్యాచ్.. వీడియో వైరల్
అంతేకాదు.. క్యాచ్ అంటే ఇలా పట్టాలి అన్నట్లుగా సహచర ఆటగాళ్ల వైపు ఓ లుక్కేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇక రోహిత్ శర్మ క్యాచ్‌ను నమ్మలేని... నేపాల్ కెప్టెన్ రోహిత్(5) బిక్కమొఖం వేసి నిరాశగా పెవిలియన్ చేరాడు.
వరుణుడి ఆటంకం
కాగా 37.5 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి నేపాల్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, సిరాజ్‌కు రెండు, శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ఇన్నింగ్స్ తర్వాత ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో చెరో పాయింట్ లభించింది.
చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా?
WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా?
A remarkable catch by Rohit Sharma has him pumped and energized. #INDvsNEP pic.twitter.com/zLu2klpiY6
— MI Fans Army™ (@MIFansArmy) September 4, 2023
Comments
Please login to add a commentAdd a comment