పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి తన సత్తాను ప్రపంచానికి చూపించాడు. ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజం విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు.
బాబర్‌కు ఇది తన కెరీర్‌లో 19వ వన్డే సెంచరీ. ఈ మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన బాబర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 238 పరుగుల తేడాతో పాకిస్తాన్ భారీ విజయం సాధించింది. పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న భారత్‌తో తలపడనుంది.
బాబర్ సాధించిన రికార్డులు ఇవే..
►వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ ఈ ఫీట్‌ను కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును ఆజం బ్రేక్ చేశాడు.
►అదే విధంగా ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(136) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో 151 పరుగులు చేసిన ఆజం.. కింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.
►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(5238), ఆసీస్ మాజీ క్రికెటర్ మార్టిన్(5346)ను బాబర్ అధిగమించాడు. ఇప్పటివరకు 102 ఇన్నింగ్స్‌లలో ఆజం 5353 పరుగులు చేశాడు.
చదవండి: AUS vs SA 1st T20I: మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు
Comments
Please login to add a commentAdd a comment