భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్దానికి సమయం అసన్నమైంది. శనివారం శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా దాయాదుల పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్ధిల పోరు కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విలేకురల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజం మాట్లాడుతూ తమపై ఎటువంటి ఒత్తడి లేదని, విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని ఆజం తెలిపాడు.
"మేము జూలై నుంచి ఇక్కడే(శ్రీలంకలో) ఉన్నాము. ఇక్కడ తొలుత శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో తలపడ్డాం. ఆ తర్వాత జట్టులో చాలా మంది ఆటగాళ్లు లంక ప్రీమిమర్ లీగ్‌లో ఆడారు. అదే విధంగా ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇక్కడే ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్ కూడా ఆడాం. కాబట్టి లంక పరిస్ధితులను మేము బాగా ఆర్ధం చేసుకున్నాము.
కాబట్టి ఈ అనుభవంతో భారత్‌పై కూడా మెరుగ్గా రాణిస్తామని ఆశిస్తున్నాను. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ అత్యంత తీవ్రత ఉంటుంది. కానీ మాపై మాత్రం ఎలాంటి అదనపు ఒత్తడి లేదు.
ఎందుకంటే మా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. మేము మా బలాలపై దృష్టి బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాము. విరాట్ కోహ్లిపై నాకు చాలా గౌరవం ఉంది. అతడు నాంటే పెద్దవాడు. అతడిని నేను ఎప్పుడు ఇష్టపడతాను. నేను నా కెరీర్ మొదలెట్టినప్పుడు అతడితో మాట్లాడా. అది నాకు ఎంతగానే ఉపయోగపడింది. మా గురుంచి బయటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారనేది అనవసరం" అని బాబర్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: పాక్ స్టార్ బౌలర్‌ను కలిసిన విరాట్ కోహ్లి.. టీ20 ప్రపంచకప్ రిపీట్ అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment