ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. క్యాండీలోని పాలకల్లే మైదానంలో శనివారం దాయాదుల పోరు జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచి పాకిస్తాన్‌కు మరోసారి ఓటమి రుచి చూపించాలని భారత్ భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం గత టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.
టీ20 ప్రపంచకప్ తర్వాత చిరకాల ప్రత్యర్థిలు ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి. ఇక ఇది ఇలా ఉండగా ఆసియాకప్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు మాత్రం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పేరిటే ఉంది.
ఆ రికార్డు మాత్రమే కింగ్ కోహ్లిదే..
ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు విరాట్ కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. 2012 ఆసియా కప్ టోర్నీలో పాక్‌పై ఏకంగా 183 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. తాజాగా ఈ ఏడాది టోర్నీలో నేపాల్‌పై 151 పరుగులు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. ఈ జాబితాలో రెండో స్ధానానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్(143), మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్(144), ముస్తిఫిజర్ రెహ్మాన్(144)ను బాబర్ అధిగమించాడు. కానీ కోహ్లి రికార్డును మాత్రం బాబర్ టచ్ చేయలేకపోయాడు.
అయితే టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి కోహ్లి రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో వేచి చూడాలి. కాగా ఆసియాకప్ వన్డే టోర్నీలో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 613 పరుగులతో పన్నెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో కోహ్లి మరో 358 పరుగులు చేస్తే.. అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండుల్కర్ (971) రికార్డును బద్దలు కొడతాడు.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే
Comments
Please login to add a commentAdd a comment