
టీ20 వరల్డ్‌కప్-2024ను నేపాల్ జట్టు ఓటమితో ఆరంభించింది. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో నేపాల్ పరాజయం పాలైనప్పటకి ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పాడెల్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఓ జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రోహిత్ పాడెల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 276 రోజుల వయస్సులో నేపాల్ జట్టు కెప్టెన్‌గా పాడెల్ వ్యవహరిస్తున్నాడు.
ఇంతకముందు ఈ రికార్డు జింబాబ్వే మాజీ కెప్టెన్ ప్రోస్పర్ ఉత్సేయ పేరిట ఉండేది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో 21 ఏళ్ల 354 రోజుల వయస్సులో జింబాబ్వే జట్టుకు ప్రోస్పర్ ఉత్సేయ సారథ్యం వహించాడు.
తాజా మ్యాచ్‌తో ఉత్సేయ ఆల్‌టైమ్ రికార్డును పాడెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆడిప అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా పాడెల్ నిలిచాడు. ఇప్పటివరకు రికార్డు రషీద్ ఖాన్ (22) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రషీద్ ఖాన్ రికార్డును పాడెల్ బద్దలు కొట్టాడు.