టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూపు-డి బంగ్లాదేశ్ తమ సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూపు-డి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ బౌలర్లు సోమ్‌పాల్ కామి, దీపేంద్ర సింగ్ ఐరీ, రోహిత్ పౌడౌల్, లమచానే తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్(17) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అదరగొట్టిన బంగ్లా బౌలర్లు..
బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. బంగ్లా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 85 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లా యువ పేసర్ టాంజిమ్ హసన్ షకీబ్ 4 వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ముస్తఫిజుర్ రెహ్మన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు. నేపాల్ బ్యాటర్లలో కుశాల్ మల్లా(27) పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక సూపర్-8కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ గ్రూపు-1లో ఆస్ట్రేలియా, భారత్, అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment