
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మనోజ్ ప్రభాకర్ గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అతడు రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ వంటి రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు.
అదే విధంగా టీ20 ప్రపంచకప్-2016 సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఇక 39 టెస్టులు, 130 వన్డేల్లో భారత్ తరపున ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించాడు.1980 నుంచి 1990లో భారత జట్టులో కీలక ఆటగాడిగా ప్రభాకర్ ఉన్నాడు. అతడు తన అంతర్జాతీయ కెరీర్‌లో 3500 పరుగులతో పాటు 253 వికెట్లు సాధించాడు.
"భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం జరిగింది. ప్రభాకర్ భారత్ తరపున 39 టెస్ట్ మ్యాచ్‌లు, 130 వన్డేలల్లో ఆడాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. నేపాల్ జట్టును ఉన్నతమైన జట్టుగా తీర్చుదిద్దుతారని ఆశిస్తున్నాము" అని క్రికెట్ నేపాల్ ట్విటర్‌లో పేర్కొంది.
చదవండి: Hardik Pandya: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా..! కచ్చితంగా సిద్ధమే.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో..