
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్ గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అఫ్గానిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. నేపాల్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారని.. తన శిక్షణతో వారిని ఉన్నతస్థితికి తీసుకెళ్తానని ప్రభాకర్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment