Manoj prabhakar
-
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్ గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అఫ్గానిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. నేపాల్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారని.. తన శిక్షణతో వారిని ఉన్నతస్థితికి తీసుకెళ్తానని ప్రభాకర్ అన్నాడు. -
నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మనోజ్ ప్రభాకర్ గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అతడు రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ వంటి రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2016 సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఇక 39 టెస్టులు, 130 వన్డేల్లో భారత్ తరపున ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించాడు.1980 నుంచి 1990లో భారత జట్టులో కీలక ఆటగాడిగా ప్రభాకర్ ఉన్నాడు. అతడు తన అంతర్జాతీయ కెరీర్లో 3500 పరుగులతో పాటు 253 వికెట్లు సాధించాడు. "భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం జరిగింది. ప్రభాకర్ భారత్ తరపున 39 టెస్ట్ మ్యాచ్‌లు, 130 వన్డేలల్లో ఆడాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. నేపాల్ జట్టును ఉన్నతమైన జట్టుగా తీర్చుదిద్దుతారని ఆశిస్తున్నాము" అని క్రికెట్ నేపాల్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Hardik Pandya: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా..! కచ్చితంగా సిద్ధమే.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో.. -
ఆల్రెడీ పెళ్లైన క్రికెటర్‌తో నటి సీక్రెట్ మ్యారేజ్, బాలీవుడ్‌కు గుడ్‌బై!
‘మంచి సినిమా.. భవిష్యత్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పక్కన రోల్.. ఇంకోసారి ఆలోచించండి మేడం..’ కాస్టింగ్ అసిస్టెంట్ నుంచి ఫోన్. ‘సారీ.. డేట్స్ క్లాష్ అవుతున్నాయి. భవిష్యత్ సూపర్ స్టార్ కోసం ఆల్రెడీ సూపర్ స్టార్‌గా ఉన్న హీరో సినిమాను వదులుకోలేను కదా..’ అని ఆ హీరోయిన్ సమాధానం. ఆమె వదులుకున్న సినిమా.. బాజీగర్. విలక్షణ నటుడు కమల్‌హాసన్ పక్కన చేయబోతున్న సినిమా కోసం. ఇది 1990ల నాటి సంగతి. ఆ హీరోయిన్.. ఫర్హీన్ ఖాన్. హిందీ నటే అయినా తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ‘జాన్ తేరే నామ్’తో తారాపథంలోకి దూసుకెళ్లింది. బాలీవుడ్‌ను మాధురీ దీక్షిత్ ఏలుతున్న కాలంలో అడుగుపెట్టింది ఫర్హీన్. అదే కను, ముక్కు తీరు.. అదే నవ్వు.. అదే గిరిజాల జుట్టు ఉండడంతో ఫర్హీన్‌ను మాధురీకి జిరాక్స్‌గా పోల్చారు. స్టార్డమ్లో కూడా మాధురీకి పోటీ వస్తుందని జోస్యమూ చెప్పారు. నిజానికి ఆ అవకాశాలు మెండుగా కనిపించాయి. కానీ హఠాత్తుగా పెళ్లి చేసేసుకొని అంతర్థానమైపోయింది. ఆ వరుడెవరు? క్రికెట్ సంచలనం.. మనోజ్ ప్రభాకర్. ఒక పార్టీలో కలుసుకున్నారిద్దరూ. అతనికి ఫర్హీన్ నచ్చింది. మాటామాటా కలిపాడు. పరిచయం పెరిగింది. ప్రేమ మొదలైంది. అయితే అప్పటికే మనోజ్ వివాహితుడు, ఒక కొడుకు కూడా. అదేమీ అభ్యంతరంగా అనిపించలేదు ఫర్హీన్‌కు. అతను ఆమె జీవితంలోకి వచ్చాక ఆమె తెర మీద మెరవలేదిక. ఇంకా చెప్పాలంటే అదృశ్యమైపోయింది. కుతూహలం కలవారు కూపీ లాగితే.. మనోజ్‌ను రహస్యంగా నిఖా చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయిందని తెలిసింది. ఇంచుమించుగా బాలీవుడ్‌తో సంబంధాలు తెంచేసుకుంది. చదవండి: వయసులో తనకంటే చిన్నవాడిని ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే? విడిపోయారని.. కాలం సాగిపోతోంది. మనోజ్, ఫర్హీన్ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. నాలుగేళ్లు గడిచాయి. ఇంతలోకే ఓ వార్త.. మనోజ్ మీద అతని మొదటి భార్య సంధ్య వరకట్న వేధింపుల కేస్ పెట్టిందని.. ఢిల్లీ హైకోర్ట్‌లో అది సెటిల్ అయిందని.. ఆ తీర్పు ప్రకారం మనోజ్.. ఫర్హీన్‌ను వదిలేసి సంధ్య దగ్గరకు వెళ్లిపోయాడు అని. బాలీవుడ్ దృష్టి మళ్లీ ఫర్హేన్ మీదకు మళ్లింది. వివరాలేమీ అందలేదు. ఇంకొన్నాళ్లకు.. ఫర్హీన్ ఢిల్లీలోనే ఉంటున్నట్టు తెలిసింది. ‘మిర్రర్ ’ ప్రతినిధి.. ఆమెను సంప్రదిస్తే ఇంటర్వ్యూ ఇచ్చింది. తను.. మనోజ్‌తో కలిసే ఉంటున్నట్టు చెప్పింది. వాళ్లు విడిపోయినట్టు వచ్చినవన్నీ వదంతులేనని తేల్చింది. ‘నిజానికి మేమిద్దరం (ఆమె, మనోజ్) ముందు ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం.. రెండింటిలో అతను గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నా ఆసరా కోరాడు. సోలేస్గా నిలిచాను. అప్పుడే కలిసి జీవిద్దామనుకున్నాం. బహుశా ఆ టైమ్‌లోనే మా మాధ్య ప్రేమ మొదలై ఉండొచ్చు. మనోజ్‌ను లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నాను. కెరీర్‌ను వదిలేశాను’ అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి వివరించింది. ‘అందరూ అనుకున్నట్టు నేనేం అదృశ్యమైపోలేదు. మా మకాం ఢిల్లీకి మారింది అంతే. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లాడి బాధ్యతల్లో పడిపోయి సినిమాల గురించి ఆలోచించలేదు. అలాగని ఖాళీగా కూడా లేను. హెర్బల్ స్కిన్‌కేర్ బిజినెస్ పెట్టాను. బాలీవుడ్‌తో కనెక్షన్ కంటిన్యూ చేయకపోయినా.. కట్ కూడా చేసుకోలేదు. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన దీపక్, ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్, శక్తి కపూర్‌తో టచ్‌లో ఉన్నాను. సినిమాల్లో నటించొద్దని మనోజ్ చెప్పలేదు. నేనే విరామం తీసుకుందామనుకున్నా. ఇప్పుడు పిల్లాడు పెద్దాడైపోయాడు. బాధ్యతలూ ఓ కొలిక్కి వచ్చాయి. కావాల్సినంత టైమ్ దొరుకుతోంది. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నా. ఇంపార్టెంట్ రోల్స్ దొరికితే కచ్చితంగా చేస్తాను. జాన్ తేరే నామ్ సినిమా సీక్వెల్ కోసం అడిగారు. ఓకే అన్నాను’ అని చెప్పింది ఫర్హీన్. త్వరలోనే ఫర్హీన్‌ను తెర మీద చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఆమె అభిమానులు. - ఎస్సార్ -
మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ పై కేసు
-
పర్హీన్ ప్రభాకర్‌పై దోపిడీ ముఠా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య, బాలీవుడ్ నటి పర్హీన్ ప్రభాకర్‌పై దేశ రాజధానిలో దోపిడీ దొంగల ముఠా దాడికి పాల్పడింది. థక్ థక్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దాడికి తెగబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. పర్హీన్ దక్షిణ ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లో ఉండే పర్హీన్ తన కారులో సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌కు వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దోపిడీ ముఠా అడ్డగించిందని పోలీసులు చెప్పారు. ఆమె తన కారును పార్క్ చేసి వారితో మాట్లాడుతుండగా దాడికి దిగి ఆమె వద్దనున్న రూ 16,000 నగదు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని రోడ్డుకు ఎదురుగా పార్క్ చేసిన వారి కారులో పరారయ్యారు. దోపిడీ ముఠా దాడికి గురైన పర్హీన్ రోడ్డుపై కుప్పకూలారు. ఓ ఆర్మీ అధికారి ఆమెకు సాయం అందించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పోలీసులకు అందచేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దక్షిణ ఢిల్లీ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
యూపీ కోచ్‌గా మనోజ్ ప్రభాకర్
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీ జట్టుకు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ కొత్త కోచ్‌గా ఎంపికయ్యాడు. గతంలో ఢిల్లీ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మనోజ్ ప్రభాకర్‌ను యూపీ కోచ్‌గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో మనోజ్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ పీడీ పాఠక్ తెలిపారు. ఈ సమావేశానికి యూపీసీఏ సెక్రటరీ హోదాలో రాజీవ్ శుక్లా హాజరయ్యారు. మరోవైపు యూపీ మాజీ కోచ్ రిజ్వాన్ శంషాద్‌ను యూపీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించగా, జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అరవింద్ కపూర్‌ను ఎంపిక చేశారు. కాగా, నితూ ద్వివేదిని మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా నియమించారు. దాంతో పాటు యూపీ అండర్ -19, అండర్-16, అండర్ -14 జట్లకు కొత్త కోచ్‌లతో పాటు మేనేజర్లను ఎంపిక చేశారు. -
వివాదంలో అజర్ సినిమా
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అజర్ సినిమా వివాదాస్పదమవుతోంది. ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్‌గా సేవలందించిన అజర్ జీవితంలో సినిమాను తలపించే ఎన్నో మలుపులున్నాయి. భారీ విజయాలు, వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో అజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అజరుద్దీన్ స్క్రీప్ట్‌ను ఓకె చేశాకే ఈ సినిమాను పట్టాలెక్కించినట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్. టోని డిసౌజా దర్శకత్వంలో శోభా కపూర్, ఏక్తా కపూర్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అజర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో మనోజ్ ప్రభాకర్ కీలక సాక్షిగా వ్యవహరించాడు. అయితే అజర్ సినిమాలో మనోజ్ పాత్రను నెగెటివ్‌గా చిత్రీకరించారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే తనకు స్పెషల్ షో వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనోజ్ ప్రభాకర్‌తో పాటు మరికొంత మంది క్రీడాకారులు కూడా అజర్ సినిమా స్పెషల్ షో కోసం పట్టు పడుతున్నారు. వీరితో పాటు అజర్ భార్య సంగీత బిజీలాని కూడా తన పాత్రను ఎలా చూపించబోతున్నారో అన్న అనుమానం వ్యక్తం చేసింది. చిత్రయూనిట్ స్పెషల్ షోకు అంగీకరించకపోవటంతో మనోజ్ సహా మిగతావారు చట్ట పరమైన చర్యలకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.