యూపీ కోచ్గా మనోజ్ ప్రభాకర్ | Manoj Prabhakar Named Coach of Uttar Pradesh Ranji Trophy Team | Sakshi
Sakshi News home page

యూపీ కోచ్గా మనోజ్ ప్రభాకర్

Published Sat, Jul 16 2016 6:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

యూపీ కోచ్గా మనోజ్ ప్రభాకర్

యూపీ కోచ్గా మనోజ్ ప్రభాకర్

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీ జట్టుకు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ కొత్త కోచ్గా ఎంపికయ్యాడు. గతంలో ఢిల్లీ కోచ్గా పనిచేసిన అనుభవం ఉన్న మనోజ్ ప్రభాకర్ను  యూపీ కోచ్గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో మనోజ్ను కోచ్గా ఎంపిక చేస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ పీడీ పాఠక్ తెలిపారు. ఈ సమావేశానికి యూపీసీఏ సెక్రటరీ హోదాలో రాజీవ్ శుక్లా హాజరయ్యారు.

 

మరోవైపు యూపీ మాజీ కోచ్ రిజ్వాన్ శంషాద్ను యూపీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించగా, జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా అరవింద్ కపూర్ను ఎంపిక చేశారు.  కాగా, నితూ ద్వివేదిని మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్గా నియమించారు. దాంతో పాటు యూపీ అండర్ -19, అండర్-16, అండర్ -14 జట్లకు కొత్త కోచ్లతో పాటు మేనేజర్లను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement