ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అండర్-19 నేపాల్ మహిళల జట్టు నమోదు చేసింది. శనివారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నేపాల్ మహిళల జట్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. తద్వారా క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌కే ఆలౌటైన జట్టుగా నేపాల్ నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.
నేపాల్ తరఫున స్నేహ మహారా 3 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక యుఎఈ బౌలర్లలో నాలుగు ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇక 9 పరుగుల లక్ష్యాన్ని 1.1 ఓవర్లలో యుఎఈ చేధించింది. కాగా జూన్ 3న (శుక్రవారం) తమ మునుపటి మ్యాచ్‌లో నేపాల్ ఖతార్‌పై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ ఖతార్‌ను 38 పరుగులకే ఆలౌట్ చేసింది.
చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..!
Comments
Please login to add a commentAdd a comment