Nepal Head Coach: నేపాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ | Indias Monty Desai appointed Nepals head coach | Sakshi
Sakshi News home page

Nepal Head Coach: నేపాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌

Published Tue, Feb 7 2023 10:17 AM | Last Updated on Tue, Feb 7 2023 10:31 AM

Indias Monty Desai appointed Nepals head coach - Sakshi

నేపాల్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ మాంటీ దేశాయ్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటిచింది. మాంటీ దేశాయ్‌ గతంలో ఐపీఎల్‌లో పాటు వెస్టిండీస్ పురుషల క్రికెట్ జట్టుకు కూడా బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశారు.

"భారత్‌ మాజీ క్రికెటర్‌, చాలా అనుభవజ్ఞుడైన మాంటి దేశాయ్‌ను  నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం జరిగింది. నేపాల్‌ జట్టును ఉన్నతమైన జట్టుగా తీర్చుదిద్దుతారని ఆశిస్తున్నాము" అని క్రికెట్‌ నేపాల్‌ ట్విటర్‌లో పేర్కొంది.

కాగా గతేడాది నేపాల్‌ హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న మనోజ్ ప్రభాకర్‌ స్థానాన్ని దేశాయ్‌ భర్తీ చేయనున్నాడు. ఇక స్వదేశంలో ఫిబ్రవరి 14 నుంచి నమీబియా,స్కాట్లాండ్‌తో జరగనున్న ట్రై సిరీస్‌లో నేపాల్‌ తలపడనుంది. ఈ సిరీస్‌ నుంచి నేపాల్‌ హెడ్‌కోచ్‌గా మాంటి దేశాయ్‌ ప్రయాణం ప్రారంభం కానుంది.


చదవండిరిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement