Desai
-
Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటిచింది. మాంటీ దేశాయ్ గతంలో ఐపీఎల్లో పాటు వెస్టిండీస్ పురుషల క్రికెట్ జట్టుకు కూడా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. "భారత్ మాజీ క్రికెటర్, చాలా అనుభవజ్ఞుడైన మాంటి దేశాయ్‌ను నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం జరిగింది. నేపాల్ జట్టును ఉన్నతమైన జట్టుగా తీర్చుదిద్దుతారని ఆశిస్తున్నాము" అని క్రికెట్ నేపాల్ ట్విటర్లో పేర్కొంది. కాగా గతేడాది నేపాల్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మనోజ్ ప్రభాకర్ స్థానాన్ని దేశాయ్ భర్తీ చేయనున్నాడు. ఇక స్వదేశంలో ఫిబ్రవరి 14 నుంచి నమీబియా,స్కాట్లాండ్తో జరగనున్న ట్రై సిరీస్‌లో నేపాల్ తలపడనుంది. ఈ సిరీస్ నుంచి నేపాల్ హెడ్‌కోచ్‌గా మాంటి దేశాయ్ ప్రయాణం ప్రారంభం కానుంది. Mrugng (Monty) Desai, a very experienced high performance coach from India, has been appointed as the head coach of the Nepal National Cricket Team. pic.twitter.com/oEHBQ69yQn — CAN (@CricketNep) February 6, 2023 చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ -
Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి
ఆడపిల్లలు పెద్ద చదువులు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు... వంటి కట్టుబాట్లు ఉన్న గ్రామంలో పుట్టిన మిత్తల్ గోహిల్ ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ చదువుకుని, అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడమేగాక, ఎనిమిది రాష్ట్రాల్లోని బాలికలు, మహిళలను చక్కగా తీర్చి దిద్దడంతోపాటు, తన సొంత గ్రామంలో ఎంతోమంది బాలికలకు ప్రేరణగా నిలుస్తోంది. గుజరాత్‌లోని మారుమూల గ్రామం అంకోట్. ఈ గ్రామంలోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది మిత్తల్ గోహిల్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ వ్యవసాయం చేసేవారు. వెయ్యిమంది ఉన్న గ్రామంలో మూఢాచారాలు ఎక్కువ. అమ్మాయిల్ని చదవనివ్వరు. చిన్నవయసులోనే పెళ్లి చేసి పంపిస్తారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పెరుగుతున్నప్పటికీ మిత్తల్ మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కలలు కనేది. కానీ గ్రామంలో అందరికీ విరుద్ధంగా తనని ఒక్కదాన్నే చదువుకోవడానికి పంపిస్తారా? అని కంగారు పడేది. కానీ మిత్తల్ తండ్రి ప్రోత్సహించడంతో పాఠశాల విద్య వరకు నవోదయ స్కూల్లో హాస్టల్ లో ఉండి చదువుకుంది. మిత్తల్ హాస్టల్ లో ఉండి చదవడాన్ని కూడా గ్రామస్థులు వ్యతిరేకించారు. కానీ మిత్తల్ ఇంగ్లిష్ మాట్లాడాలని పట్టుబట్టి మరీ ఆమె తండ్రి చదివించడంతో.. ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తిచేసి, తరువాత సోషల్ వర్క్‌లో మాస్టర్స్ కూడా చేసింది. ముగ్గురి నుంచి వందలమంది... కాలేజీ రోజుల్లో నవలలు చదివే అలవాటు ఉన్న మిత్తల్ నవలల్లోని రచనల ద్వారా భారతదేశంలో మహిళల పరిస్థితులపై అవగాహన పెంచుకుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆదివాసీలకోసం పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ ఇంట్లోవాళ్లు పంపించకపోవడంతో తన గ్రామానికి దగ్గర్లో ఉన్న భారుచ్‌లో మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టులో ఏరియా మేనేజర్‌గా చేరింది. ఇక్కడ మూడున్నరేళ్లు పనిచేసిన అనుభవంతో 2017లో ‘దేశాయ్ ఫౌండేషన్’లో చేరింది. ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్న ఈ ఫౌండేషన్‌లో చేరిన కొద్దిరోజుల్లోనే తన పనితీరుతో దాదాపు ఐదు వందలమంది పనిచేసే అతిపెద్ద సంస్థగా తీర్చిదిద్దింది. దీంతో ఫౌండేషన్‌లో చేరిన రెండేళ్ల తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యింది. ఫౌండేషన్ టీమ్‌తో కలిసి యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ముప్పై లక్షలమంది మహిళలు, బాలికల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్లెజర్ పిరియడ్... దేశాయ్ ఫౌండేషన్ ద్వారా.. మహిళాభివృద్ధి, సమాజంలో ఉన్నతంగా బతికేందుకు కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనిలో భాగంగా ‘ప్లెజర్ పిరియడ్’ పేరిట పిరియడ్స్, మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా నిలబడేలా వృత్తిపరమైన శిక్షణలు, కంప్యూటర్ ట్రైనింగ్, బ్యూటీ కోర్సులో శిక్షణ, పచ్చళ్లు, అప్పడాల తయారీ, క్యాండిల్స్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి స్టార్టప్ పెట్టడానికి కావాల్సిన రుణసదుపాయం కల్పించడం వరకు అన్ని రకాలుగా సాయపడుతూ మహిళా అభ్యున్నతికి పాటుపడుతోంది. మిత్తల్ తన నైపుణ్యంతో ఫౌండేషన్‌తోపాటు తన సొంత గ్రామంలో మార్పు తీసుకురావడం విశేషం. ‘‘అక్కలా చదవాలి...’’ నాన్న చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరుకునేవారు. తొలిసారి 2018లో అమెరికా వెళ్లినప్పుడు నాలుగు వందలమంది ముందు ఎంతో ధైర్యంగా ఇంగ్లిష్ మాట్లాడాను. నాన్న నా ఇంగ్లిష్ ప్రసంగాలను మెచ్చుకున్నారు. దేశాయ్ ఫౌండేషన్‌లో పనిచేస్తూ ఎంతోమంది బాలికలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం. మా గ్రామంలో ఎంతోమంది చిన్నారులకు నేను ప్రేరణగా నిలుస్తున్నాను. గ్రామంలోని చాలా మంది తల్లిదండ్రులు మిత్తల్ అక్కలా, ఆ మేడంలా చదవాలి అని తమ కూతుళ్లకు చెబుతున్నారు. నా స్ఫూర్తితో గ్రామంలో ముప్పైమందికి పైగా అమ్మాయిలు డిగ్రీ పూర్తి చేశారు. ఏడుగురు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఎప్పుడూ ముసుగులు వేసుకుని సిగ్గుపడుతూ వచ్చే మహిళలు ఇప్పుడు ముసుగు తీసి ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వారి మాటతీరు, కట్టుబొట్టు అంతా మారిపోయింది. ఇంతమంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉంది’’. – మిత్తల్ గోహిల్ -
యంగ్ టాలెంట్: మధుర స్వర రాగ మీరా
ఒకవైపు హిందుస్థానీ సంగీతం మరోవైపు వెస్ట్రన్ మ్యూజిక్... వెరసి ఆమె పాటకు కొత్త చూపును ఇచ్చాయి. ‘పాట అంటే వాద్యాల ఘోష కాదు... మనల్ని మనం పుస్తకంలా చదువుకోవడం కూడా’ అంటున్న మీరా దేశాయ్ పరిచయం... అమెరికాలో పుట్టి పెరిగినా, తన సంగీత, సాహిత్యాలలో ‘భారతీయత’ ఎక్కడికీ పోలేదు. సందేహం ఉంటే...‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టు బీ లాస్ట్’ ఈపీ(ఎక్స్టెండెడ్ ప్లే)లో పాటలు వినండి చాలు. తల్లిదండ్రులు మీరాకు గుజరాతి భాష నేర్పించారు. చిన్న వయసులోనే ఎన్నో భజనలను తల్లి ద్వారా నేర్చుకుంది. అలా తన మాతృభాషపై ఆసక్తి పెరిగింది, పదిహేడు సంవత్సరాల వయసులో తొలి పాట రాసిన మీరాకు తొలిసారిగా న్యూయార్క్‌లో జరిగిన ఒక సంగీత కచేరిలో హిందుస్థానీ శాస్త్రీయసంగీత దిగ్గజం పండిట్ జస్రాజ్ను చూసే అదృష్టం దక్కింది. ఆ క్షణమే తనకు హిందుస్థానీ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. ప్రతిరోజూ తన చెవుల్లో హిందుస్థానీ సంగీతం మారుమోగేది. ఎందరు గాయకులో, ఎన్ని ఘరానాలో! హిందుస్థానీ దగ్గరే ఆగిపోలేదు. వెస్ట్రన్ మ్యూజిక్‌లో పదిసంవత్సరాల పాటు శిక్షణ పొందింది. ఫిమేల్ జాజ్ స్టార్స్...నైనా సిమోన్, నోరా జోన్స్, పాప్ సింగర్–సాంగ్ రైటర్స్ సారా బెరిలెస్, టోరీ కెల్లీ...తాను అభిమానించే జాబితాలో చేరిపోయారు. వారి ప్రభావం తన పాటలపై కనిపిస్తుంది. తన డెబ్యూ ఈపి ‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టూ బీ లాస్ట్’ విడుదలైనప్పుడు తనదైన సొంతగొంతు వినిపించింది. రకరకాల సంగీతధోరణుల ప్రభావంతో పెరిగిన మీరాకు అది అంత తేలికైన విషయం కాదు. ‘మనదైన సొంతగొంతు వినిపించాలంటే, కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి రావాలి’ అంటుంది మీరా. పాట అంటే వాయిద్యాల ఘోష కాదు. అందులో ఎమోషన్ డెప్త్ శ్రోతలను హంట్ చేయాలి. అది మీరా పాటల్లో వినిపిస్తుంది. ‘డివైన్’ పాటలో ఇలా రాసింది మీరా... ‘నా జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చదువుకోవాలని ఉంది’ జీవితపుటలను తిరగేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎక్కడ ఆగిపోయాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి? అనే ప్రశ్నలకు సాధికారికమైన సమాధానాలు వెదుక్కోవచ్చు. ఇక ‘డిస్టెన్స్’ పాట దగ్గరికి వస్తే...దూరం పెరగడం అనేది అన్ని విషయాల్లోనూ భారమైన విషయమేమీ కాదు. కొన్ని విషయాల్లో అది శక్తిని ఇచ్చే పని. మనల్ని మనం పునరావిష్కరించుకునే పని. ఎక్కడి వరకో ఎందుకు? మనలోని బద్దకానికి దూరంగా జరిగితే, నిర్మాణరాహిత్యానికి దూరంగా జరిగితే... అదేమీ ప్రతికూలత కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే. వెదుక్కుంటూ వెళితే మన మూలాల జాడ దొరుకుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లడం ద్వారా తన రూట్స్లోకి వెళ్లింది మీరా. ‘ఆల్ మై లైఫ్ ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ సెర్చింగ్ ఫర్ సమ్‌థింగ్...’ అని తన ‘డివైన్’ లో చరణాలను పాడుకునే ఉంటుంది ఇరవై ఆరు సంవత్సరాల మీరా. ఆమె వెదుకుతున్నది అక్కడ ఏమైనా కనిపించిందా? ఒకవేళ కనిపిస్తే అది కచ్చితంగా ఆమె పాటలో వినిపిస్తుంది. వేచిచూద్దాం. -
ఆఖరి బంతి.. ఆరు పరుగులు.. ఆరు వైడ్లు!
-
ఒక్క బంతికి సిక్స్ అవసరమైతే.. ఆరు వైడ్లు వేశాడు
ముంబై: క్రికెట్ చరిత్రలో ఆఖరి బంతికి ఆరు కొట్టి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా, రెండు రోజుల క్రితం జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ అవసరమైంది. కానీ, సిక్స్ కొట్టకుండానే ఆరు పరుగులు రావడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఆదర్శ్ క్రికెట్ క్లబ్(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 76 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దేశాయ్ ఒక్క బంతికి 6 పరుగులు కావాల్సివచ్చింది. ఇది ఐదు ఓవర్ల మ్యాచ్ కాగా, దేశాయ్ 4.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. అయితే, ఒకే బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండటంతో ఇరు జట్ల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మొదటి బాల్ పడింది.. అది కాస్త వైడ్. ఇంకో బంతి పడింది అది కూడా వైడ్!.. ఇలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక్కడ చదవండి: 35/3 నుంచి 35/10 -
తృప్తి దేశాయ్ పై దాడి
పుణె: భూమాతా బ్రిగేడియర్ చీఫ్ తృప్తి దేశాయ్, ఆమె అనుచరులపై దాడి జరిగింది. ఇందులో ఒకరి తలకు తీవ్రంగా గాయమైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై కొందరు ఆందోళనకారులు నాశిక్ వద్ద నిన్న అర్ధరాత్రి దాడి చేశారు. తనను చంపడానికే దాడి జరిగిందని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన నాశిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాశిక్ లోని కపిలేశ్వర్ మందిర్ లోని గర్భ గృహలో పూజలు చేయడానికి ఆమె అనుచరులతో కలిసి నిన్నరాత్రి 11 గంటల ప్రాంతంలో వెళ్లారు. తృప్తి రాకను వ్యతిరేకిస్తూ అక్కడ గుమిగూడిన జనం నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆమె తన కారులో వేరే మార్గం ద్వారా తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై దాడి చేశారు. -
హజి అలీ దర్గాలో ప్రవేశించిన తృప్తీ దేశాయ్
ముంబైః భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు, మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీదేశాయ్ ముస్లింల పవిత్ర క్షేత్రాలనూ వదల్లేదు. ప్రసిద్ధ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై పోరాడి ఫలితాలను సాధిస్తున్న ఆమె..... తన మద్దతుదారులతో కలసి, తాజాగా ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించి సంచలనం రేపింది. పలువురు మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు భారీ బందోబస్తుతో తృప్తి దేశాయ్...ముంబైలోని ముస్లిం పవిత్ర క్షేత్రం హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ, సంప్రదాయ బంధనాలను తెంచుకొని ఆమె.. గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అయితే దర్గాలోని గర్భాలయంలోకి మాత్రం ఆమె ప్రవేశించలేదు. దర్గా ఆచారాలను అనుసరించి, ట్రస్ట్ సభ్యుల అనుమతితో, పోలీసు బందోబస్తుతో దర్గాలోకి ప్రవేశించిన తృప్తి... అక్కడ ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోపు మరోసారి దర్గాలోని పురుషులు మాత్రమే ప్రవేశించే ముఖ్య ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడే ప్రార్థనలు జరుపుతామంటూ వ్యాఖ్యానించారు. తృప్తి దేశాయ్, ఆమె మద్దతు దారులు, ఇంతకు ముందే ఓసారి దర్గాలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా... పోలీసులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. ప్రార్థనాలయాల్లో మహిళలకు అనుమతిపై లింగ వివక్షను విడనాడాలంటూ పోరాడుతున్న తృప్తి దేశాయ్... శనిసింగనాపూర్, త్రంయబకేశ్వర్ హిందూ ఆలయాల ప్రవేశం అనంతరం ముంబైలోని ప్రముఖ దర్గా ప్రవేశాన్ని ఎంచుకున్నారు. త్వరలోనే మహిళలను దర్గాలోని నిషేధ ప్రాంతానికి కూడ అనుమతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
'మోహన్ భగవత్ ప్రగతిశీల ఆలోచనాపరుడు'
ఆలయాల్లో స్త్రీల ప్రవేశం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్... తమ హక్కుల పోరాటంలో మోహన్ భగవత్ వైఖరిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. తాజాగా ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలంటూ డిమాండ్ చేసిన ఆమె... మోహన్ భగవత్ జీ ప్రగతిశీల ఆలోచనాపరుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ వైఖరిని ఆయన గౌరవిస్తారని భావిస్తున్నానన్నారు. స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం పోరాటంలో భాగంగా తృప్తిదేశాయ్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ డిమాండ్ ను మోహన్ భగవత్ గౌరవిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాము సాధించాలని ప్రయత్నిస్తున్న హక్కులపై సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తమ వైఖరిని తెలియజేయాలన్నారు. ఆ విధంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ సమానత్వంకోసం పోరాడుతున్న తమకు.. మద్దతు పలుకుతుందని నమ్ముతున్నట్లు తృప్తి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రీయ సేవికా సమితి ద్వారా మహిళలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆర్ ఎస్ ఎస్ లో ప్రత్యక్షంగా సభ్యంత్వం కోసం తృప్తి డిమాండ్ ను లేవనెత్తారు. తృప్తిదేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే తృప్తి తాజా డిమాండ్ పై మాట్లాడిన బిజెపి ఉపాధ్యక్షుడు కాంత నలవాడే మాత్రం ఆమె డిమాండ్లు అర్థరహితమని, అనవసరమైన సమస్యలు సృష్టించకుండా.. మహిళలను వేధిస్తున్న ఇతర సమస్యల పరిష్కారానికి పోరాడితే మంచిదని సూచించారు.