ధర్మశాలలో నేపాల్ జట్టు
న్యూఢిల్లీ : ఘోర భూకంపం అనంతరం నేపాల్ దేశస్తులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోవైపు ఆ దేశ క్రికెట్ జట్టు కూడా తిరిగి ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టింది. అయితే అక్కడి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో 22 మంది సభ్యులున్న జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ప్రపంచ టి20 క్వాలిఫయర్స్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ధర్మశాల క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ ఆరంభించారు.
‘భూకంప విషాదం నుంచి కోలుకుంటున్నాం. అందులో భాగంగానే తిరిగి ఆటపై దృష్టి పెట్టాం. మాకీ సౌకర్యం కల్పించినందుకు బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు. ఇక్కడి సదుపాయాలు ప్రపంచస్థాయిలో ఉన్నాయి. రెండు వారాల శిక్షణలో మా ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తాం’ అని కెప్టెన్ పారస్ ఖడ్కా అన్నాడు.