
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పిచ్‌పై.. ‘మొక్కలు నాటుతున్నాడా... లేదా ముగ్గు వేస్తున్నాడా... అదీ కాదంటే మేస్త్రీలా పిచ్‌పై కాంక్రీట్ వేస్తున్నాడా’ అంటూ నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. కోహ్లి ఫన్నీ మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటా చక్కర్లు కొడతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. గువాహటి బార్సపర స్టేడియంలో శ్రీలంకతో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్షం అనంతరం విరాట్ పిచ్‌ను పరిశీలిస్తున్న ఫొటోను భారత క్రికెట్ కౌన్సిల్ బోర్టు(బీసీసీఐ) ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ‘తదుపరి తనిఖీ సాయంత్రం 9:30 గంటలకు’ అంటూ షేర్ చేసిన విరాట్ ఫొటోకి నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ను జోడించి తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కోహ్లి విత్తనాలు నాటుతున్నట్లు, రంగోలి దిద్దుతున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేసి సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక విరాట్ ముగ్గు వేస్తుంటే అతని భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పక్కనే కుర్చుని చూస్తున్న మీమ్ ప్రతీ ఒక్కరిని తెగ ఆకట్టుకుంటుంది.
Waiting for the pitch to dry like :#INDvSL #INDvsSL pic.twitter.com/uKpJFFcwsu
— OM Rajpurohit (@omrajguru) January 5, 2020
చదవండి: మెరుపుల్లేవ్... చినుకులే!

Comments
Please login to add a commentAdd a comment