నేపాల్ క్రికెట్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్దికంగా వెనుకపడిన నేపాల్ క్రికెట్ బోర్డుకు లబ్ది చేకూరే విధంగా ఆ దేశ క్రికెట్ జట్టుతో ట్రైయాంగులర్ సిరీస్‌ను ప్లాన్ చేసింది. భారత దేశవాలీ ఛాంపియన్ జట్లైన్ బరోడా, గుజరాత్ జట్లు మార్చి 31-ఏప్రిల్ 7 మధ్యలో నేపాల్ టీమ్‌తో ట్రై సిరీస్ ఆడనున్నాయి. ఈ టోర్నీ మొత్తం గుజరాత్‌లోని వాపి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ ట్రై సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను నేపాల్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఫిబ్రవరి 19) విడుదల చేసింది.
అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లతో టోర్నీమెంట్ ఆడటం ద్వారా నేపాల్ జట్టుకు అంతర్జాతీయ అనుభవం వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2024 నేపథ్యంలో ఈ టోర్నీ నేపాల్ జట్టుకు చాలా ఉపయోగపడుతుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రన్నరప్ అయిన బరోడా టీమ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. గుజరాత్ జట్టులో పియూష్ చావ్లా, రవి బిష్ణోయ్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. ఈ ట్రై సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. నేపాల్ జట్టు మార్చి 31న గుజరాత్‌తో, ఏప్రిల్ 2న బరోడాతో, ఏప్రిల్ 3న మళ్లీ గుజరాత్‌తో, ఏప్రిల్ 5న మరోసారి బరోడాతో తలపడనుంది. ఏప్రిల్ 7న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా, నేపాల్ జట్టు ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment