
డంబుల్లా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక అర్ద సెంచరీతో (54) రాణించగా.. కుసాల్ మెండిస్ 26, కుసాల్ పెరీరా 24, కమిందు మెండిస్ 19, చరిత్ అసలంక 9, భానుక రాజపక్స 5, వనిందు హసరంగ 5 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, షమార్ స్ప్రింగర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కమిందు మెండిస్ (51), చరిత్ అసలంక (59) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రాండన్ కింగ్ (63), ఎవిన్ లెవిస్ (50) అర్ద సెంచరీలు చేసి విండీస్‌ను గెలిపించారు.
చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. భారీ రికార్డుపై కన్నేసిన విరాట్
Comments
Please login to add a commentAdd a comment