హెట్‌మైర్ పోరాటం వృథా.. 20 పరుగులు తేడాతో శ్రీలంక విజయం
వెస్టిండీస్‌పై శ్రీలంక 20 పరుగులు తేడాతో విజయం సాధించింది. 190పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవరల్లో 169 పరుగులకే పరిమితమైంది. హెట్‌మైర్( 81) చివర వరకు పోరాడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో సెమీస్ రేస్ నుంచి వెస్టిండీస్ తప్పుకుంది. శ్రీలంక బౌలర్లలో బినూర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా చెరో రెండు వికెట్లు సాధించారు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిస్సాంక, అసలంక ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో నీర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది.వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లు, బ్రావో వికెట్ సాధించాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ .. పూరన్(46) ఔట్
77 పరుగుల వద్ద పూరన్ రూపంలో వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన పూరన్, చమీరా బౌలింగ్‌లో డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 12 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెట్‌మైర్(20), రస్సెల్(1) ఉన్నారు.
10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్
190పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. క్రిస్‌గేల్(1), లూయిస్(8)ను ఒకే ఓవర్‌లో బినూర ఫెర్నాండో పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ చేజ్(0),పూరన్(24) ఉన్నారు.
చేలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. వెస్టిండీస్ టార్గెట్190 పరుగులు
నిస్సాంక, అసలంక ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో శ్రీలంక నీర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(51),అసలంక(68) కుసల్ పెరీరా(29) పరుగులు సాధించారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లు, బ్రావో వికెట్ సాధించాడు.
నిస్సాంక ఆర్ధసెంచరీ.. శ్రీలంక...14 ఓవర్లకు 120/1
సమయం: 20:50 శ్రీలంక ఓపెనర్ నిస్సాంక ఆర్ధసెంచరీతో చేలరేగాడు. 15 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(51), అసలంక(47) పరుగులతో క్రీజులో ఉన్నారు.
అదరగోడుతున్న శ్రీలంక...14 ఓవర్లకు 120/1
వెస్టిండీస్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో శ్రీలంక దుమ్మురేపుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(45), అసలంక(42) పరుగులతో క్రీజులో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న శ్రీలంక... 10 ఓవర్లుకు 82/1
సమయం: 20:20 వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక నిలకడగా ఆడుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(24), అసలంక(26) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుసల్ పెరీరా(29) ఔట్:
సమయం: 20:00 వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కుసల్ పెరీరా రూపంలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగలు చేసిన పెరీరా, రస్సెల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(12), అసలంక(5) పరుగులతో క్రీజులో ఉన్నారు.
అబుదాబి: టి20 ప్రపంచకప్-2021 సూపర్ 12లో భాగంగా గ్రూప్ 1లో గురువారం(నవంబర్4) వెస్టిండీస్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఢిపిండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ వరుస ఓటమిలతో సెమీస్ అవకాశాలను ఇప్పటికే సంక్లిష్టం చేసుకుంది.
అయితే మునపటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం కరీబీయన్లకు కాస్త ఊరటను ఇచ్చింది. ఇక శ్రీలంక ఈ టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 3ఓటమిలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ముఖాముఖి 7 సార్లు తలపడగా శ్రీలంక 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వెస్టిండీస్ రెండు సార్లు విజయం సాధించింది.
వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, రవి రాంపాల్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా(వికెట్ కీపర్) చరిత్ అసలంక, భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, బినూర ఫెర్నాండో
చదవండి: ICC Player Of The Month: షకీబ్, ఆసిఫ్, డేవిడ్.. టీమిండియా ఆటగాళ్లు ఒక్కరూ లేరు
Comments
Please login to add a commentAdd a comment