West Indies vs Srilanka
-
SL vs WI 2nd T20I: విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్‌ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.పరిమిత ఓవర్ల సిరీస్ కోసంకాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్‌కు దంబుల్లా, వన్డే సిరీస్‌కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.నిసాంక హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా... కుశాల్ మెండిస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కుశాల్ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.బౌలర్లు పడగొట్టేశారుఇక విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రావ్మన్ పావెల్ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్) టాప్ స్కోరర్. బ్రాండన్ కింగ్ (5), ఎవిన్ లూయిస్ (7), ఆండ్రూ ఫ్లెచర్ (4), రోస్టన్ చేజ్ (0) పూర్తిగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్ వెల్లలాగె 3, మహీశ్ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్ -
SL Vs WI: విండీస్‌తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
డంబుల్లా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక అర్ద సెంచరీతో (54) రాణించగా.. కుసాల్ మెండిస్ 26, కుసాల్ పెరీరా 24, కమిందు మెండిస్ 19, చరిత్ అసలంక 9, భానుక రాజపక్స 5, వనిందు హసరంగ 5 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, షమార్ స్ప్రింగర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కమిందు మెండిస్ (51), చరిత్ అసలంక (59) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రాండన్ కింగ్ (63), ఎవిన్ లెవిస్ (50) అర్ద సెంచరీలు చేసి విండీస్‌ను గెలిపించారు. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. భారీ రికార్డుపై కన్నేసిన విరాట్ -
SL vs WI: విండీస్ హార్డ్ హిట్టర్స్ దూరం.. పదిహేడేళ్ల కుర్రాడికి చోటు
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. రోవ్‌మన్ పావెల్ సారథ్యంలో టీ20 జట్టు.. షాయీ హోప్ కెప్టెన్సీలో వన్డే జట్టు లంక పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపింది. స్టార్ ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కానుండగా.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఈ జట్లలో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది.కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్టోబరు 13- 26 మధ్య మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు శనివారం జట్లను ప్రకటించిగా.. టీ20 జట్టులో కొత్తగా టెర్రెన్స్ హిండ్స్, షామార్ స్ప్రింగర్ చోటు దక్కించుకున్నారు.కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటికరేబియన్ ప్రీమియర్ లీగ్-2024(సీపీఎల్)లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రైటార్మ్ పేసర్ హిండ్స్.. ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక స్ప్రింగర్ కూడా కుడిచేతి వాటం పేసరే. 18 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.వీరిద్దరితో పాటు.. పదిహేడేళ్ల వికెట్ కీపర్ జువెల్ ఆండ్రూకు కూడా విండీస్ సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. అయితే, అతడిని వన్డే జట్టుకు ఎంపిక చేయడం గమనార్హం. జువెల్ ఇప్పటి వరకు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లలో కలిపి 165 పరుగులు సాధించాడు.స్టార్లు దూరం.. యువ ఆటగాళ్ల పాలిట వరంశ్రీలంకతో సిరీస్‌లకు విధ్వంసకర వీరులు నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, షిమ్రన్ హెట్మెయిర్, స్పిన్నర్ అకీల్ హొసేన్ దూరమయ్యారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో వీరంతా విశ్రాంతి కావాలని కోరగా.. అందుకు తాము సమ్మతించినట్లు వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ చెప్పాడు.శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, అలిక్ అథనేజ్, ఆండ్రీ ఫ్లెచర్, టెర్రెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షామార్ స్ప్రింగర్శ్రీలంకతో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుషాయీ హోప్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జువెల్ ఆండ్రూ, అలిక్ అథనేజ్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్.చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్ -
WC: 2012లో వెస్టిండీస్ అలా.. 2022లో పాకిస్తాన్ ఇలా! విండీస్ గెలిస్తే.. పాక్ మాత్రం
T20 World Cup: 2012 Winner West Indies- 2022 Winner England: వరల్డ్‌కప్ ఫైనల్ ఈసారి ‘టై’ కాలేదు... సూపర్ ఓవర్లు కూడా సమం కాలేదు... క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి, సగం గెలుపు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడానికి ఇంగ్లండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి చర్చే రాకుండా అద్భుత ఆటతో అందరికంటే శిఖరాన నిలిచింది. టోర్నీ ఆరంభంలో వర్షం తమ అవకాశాలను దెబ్బకొట్టినా, ఒక్కసారిగా పుంజుకొని మ్యాచ్‌లు వానపాలైన వేదికపైనే విశ్వ విజేతగా ఆవిర్భవించింది. వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు రెండూ ఒకే సమయంలో తమ వద్ద కలిగి ఉన్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ గెలిచినా వివాదం వెంట తీసుకొచ్చి ఆనందం కాస్త మసకబారగా... అంతకుముందే ఆరేళ్ల క్రితం టి20 వరల్డ్‌కప్ ఆఖరి మెట్టుపై అనూహ్య రీతిలో ఓడింది. వాటిని మరిచేలా తాజా విజయం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చూపించింది. వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు... తొలుత బ్యాటింగ్ చేస్తూ.. పాకిస్తాన్ చూపిన పేలవ బ్యాటింగ్ ఇది... టి20ల్లో చివరి నాలుగు ఓవర్లంటే బౌలర్లకు డెత్ ఓవర్లు! కానీ పాక్ దానిని రివర్స్‌గా మార్చింది. ఆఖరి 4 ఓవర్లలో కనీసం 40 పరుగులు చేస్తే విజయంపై ఆశలు ఉంచుకోగలిగే చోట 18 పరుగులకే పరిమితమైంది. ముగింపు స్కోరుతోనే పాక్ ఓటమికి పునాది పడింది. టోర్నీ ఆసాంతం చెలరేగిన స్యామ్ కరన్ బౌలింగ్ పదును ముందు పాక్ తేలిపోయింది. 2012 ఫైనల్లో కూడా విండీస్ 137 పరుగులే చేసి విజేతగా నిలిచిన తీరు గుర్తుకొచ్చిందేమో... పాక్‌లో కాస్త ఆశలు పెరిగాయి! పైగా తొలి ఓవర్లోనే హేల్స్ అవుట్ కావడం, మెల్బోర్న్ మైదానం మొత్తం హోరెత్తిపోవడం ఆ జట్టును మరింత ఉత్సాహపరచింది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని పాక్ కట్టడి కూడా చేయగలిగింది కూడా. అయితే పాక్ ఆశించినట్లుగా 1992 పునరావృతం కాలేదు. బెన్ స్టోక్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 43 మ్యాచ్‌ల టి20 కెరీర్లో తన తొలి అర్ధసెంచరీ చేసేందుకు అతను సరైన సమయాన్ని ఎంచుకున్నట్లున్నాడు. చివరి వరకూ నిలబడి మరోసారి తన చేతుల మీదుగా ఇంగ్లండ్‌ను వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిపాడు. 2012లో వెస్టిండీస్ అలా విజేతగా.. శ్రీలంక వేదికగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీ20 ప్రపంచకప్-2012 ఫైనల్లో వెస్టిండీస్ ఆతిథ్య శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు జాన్సన్ చార్ల్స్(0), క్రిస్ గేల్ (3) వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్లన్ సామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో డ్వేన్ బ్రావో 19, కెప్టెన్ డారెన్ సామీ 26(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సామీ బృందం 137 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ మహేల జయవర్దనే 33 పరుగులతో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ సంగక్కర 22 పరుగులు చేయగా.. నువాన్ కులశేఖర 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల స్కోరు కనీసం ఐదు పరుగులు కూడా దాటకుండా విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో18.4 ఓవర్లలో 101 పరుగులకే లంక ఆలౌట్ అయింది. నాడు అదరగొట్టిన విండీస్ బౌలర్లు వెస్టిండీస్ బౌలర్లలో సునిల్ నరైన్ 3.4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చగా.. సామీ రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సామ్యూల్ బద్రీకి ఒకటి, రవి రాంపాల్‌కు ఒకటి, మార్లన్ సామ్యూల్స్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రతిభతో మార్లన్ సామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2022లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఇలా టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆదివారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. షాన్ మసూద్ (28 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (3/12) పాక్‌ను పడగొట్టగా... ఆదిల్ రషీద్, జోర్డాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. 6 మ్యాచ్‌లలో 11.38 సగటు, 6.52 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్యామ్ కరన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. అంతా విఫలం... ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ (15) పాక్‌కు దూకుడైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు ఒకే ఒక బౌండరీ (సిక్స్) కొట్టగా, తర్వాతి ఓవర్లో రిజ్వాన్ వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో స్కోరు 39 పరుగులకు చేరింది. ధాటిగా ఆడగల హారిస్ (8)ను రషీద్ తన తొలి బంతికే అవుట్ చేయగా, 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు 68 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లే ఉన్నాయి! లివింగ్‌స్టోన్ ఓవర్లో 4, 6తో మసూద్ జోరును పెంచే ప్రయత్నం చేయగా, బాబర్‌ను చక్కటి రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసి రషీద్ మళ్లీ దెబ్బ కొట్టాడు. ఇఫ్తికార్ (0) కూడా చేతులెత్తేయడంతో పాక్ కష్టాలు మరింత పెరిగాయి. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాక్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో జట్టు పరిస్థితి మరీ ఘోరంగా కనిపించింది. చివరి 4 ఓవర్లలో పాక్ కేవలం 18 పరుగులు మాత్రమే జోడించి ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున 4 వికెట్లు కోల్పోయింది. దాంతో కనీస స్కోరును కూడా సాధించలేక పాక్ ఇన్నింగ్స్ ముగించింది. హేల్స్ విఫలం... ఛేదనలో ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడలేదు. అయితే లక్ష్యం బాగా చిన్నది కావడంతో జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో ఆ జట్టు విజయాన్నందుకుంది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేయగా, జోస్ బట్లర్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆపై నసీమ్ తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ మూడు ఫోర్లతో ఎదురుదాడి చేసింది. రవూఫ్ తన రెండు వరుస ఓవర్లలో సాల్ట్ (10), బట్లర్‌లను అవుట్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 49/3 వద్ద నిలిచింది. ఈ దశలో పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. బౌండరీలు రావడం కష్టంగా మారిపోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు ఇంగ్లండ్ బౌండరీ కొట్టలేకపోయింది! అయితే స్టోక్స్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్ (23 బంతుల్లో 20; 1 ఫోర్) అవుటైనా... సింగిల్స్‌తోనే పరుగులు రాబడుతూ తన వికెట్ మాత్రం అప్పగించకుండా జాగ్రత్త పడ్డాడు. గాయంతో అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆ ఓవర్ పూర్తి చేసేందుకు ఇఫ్తికార్ రాగా వరుసగా 4, 6 బాదాడు. 24 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో వసీమ్ వేసిన 17వ ఓవర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) 3 ఫోర్లు కొట్టడంతో పని సులువైంది. వసీమ్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్... చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఇంగ్లండ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిపాడు. చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే టైటిల్ గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్ టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు View this post on Instagram A post shared by ICC (@icc) -
ధనంజయ సెంచరీ.. డ్రా అయ్యే అవకాశమే ఎక్కువ
గాలే: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా అజేయ సెంచరీ (153 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. దాంతో గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 279 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 46/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంకను ధనంజయ ఆదుకున్నాడు. నిసంక (66; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 78 పరు గులు... లసిత్ ఎంబుల్దేనియా (25 బ్యాటింగ్; 1 ఫోర్)తో కలిసి అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 107 పరుగులు జోడించాడు. ఫలితంగా శ్రీలంక పటిష్ట స్థితిలో నిలిచింది. ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశం ఉంది. -
వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా!
Joshua da Silva Vs Dhananjaya de Silva.. క్రికెట్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటలయుద్ధం జరగడం సహజం. వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇక ఆటగాళ్లు ప్రతీకారం ఈ విధంగా కూడా తీసుకుంటారా అని అనిపించడం ఖాయం. వారిద్దరే ధనుంజయ్ డిసిల్వా.. జోషువా ద సిల్వా. ధనుంజయ్ డిసిల్వా శ్రీలంక ఆల్‌రౌండర్ కాగా... జోషువా ద సిల్వా వెస్టిండీస్ వికెట్ కీపర్. ఇక విషయంలోకి వెళితే.. లంక, విండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో విండీస్ కీపర్ ద సిల్వా.. లసిత్ ఎంబుల్దేనియా బౌలింగ్‌లో ధనుంజయ్ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన జోషువా.. కీలక సమయంలో రాణించినప్పటికి జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తాజాగా రెండో టెస్టులో ఈసారి 2 పరుగులు చేసిన ధనుంజయ్ డిసిల్వా.. వీరాస్వామి పెరుమాల్ బౌలింగ్‌లో జోషువా ద సిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్‌కు వెళ్తున్న ధనుంజయ్‌ను ఉద్దేశించి జోషువా ..''నువ్వు నా క్యాచ్ పట్టావు.. నేను నీ క్యాచ్ పట్టా.. క్రికెట్లో జరిగేది ఇదే'' అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 21, చరిత్ అసలంక 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. రమేశ్ మెండిస్ 6 వికెట్లు తీయగా.. ఎంబుల్డేనియా 2, జయవిక్రమ 2 వికెట్లు తీశారు. చదవండి: ICC Test Rankings: టాప్-5లోకి దూసుకొచ్చిన షాహిన్.. దిగజారిన విలియమ్సన్ "You catch me, I catch you - that's how it works in cricket" - @joshuadasilva08 😂 After being caught by (Dhananjaya) de Silva in the first Test, (Joshua) Da Silva promised revenge - and he got it! #SLvWI pic.twitter.com/GqkKR4NM3U — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 30, 2021 -
Dimuth Karunaratne: శ్రీలంక కెప్టెన్ అరుదైన ఘనత.. రెండో ఓపెనర్‌గా
SL Vs WI- Dimuth Karunaratne jumps to second spot for most runs by Sri Lankan openers in Tests: వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రీలంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే అరుదైన రికార్డు సాధించాడు. లంక తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. 137 ఇన్నింగ్స్‌లో 5374 పరుగులు సాధించి సనత్ జయసూర్య(5932) తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. మరో 558 పరుగులు చేస్తే జయసూర్య రికార్డును కరుణరత్నే అధిగమిస్తాడు. ఇక ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో మర్వన్ ఆటపట్టు (5317), దిల్షాన్(2170), ఆర్ఎస్ మహానామా(2069) ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ క్యాలెండర్(2021) ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సాధించిన ఆటగాళ్ల జాబితాలో కరుణ రత్నే(854) మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అత్యధిక స్కోరు 244. ఇక ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(1455), టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(906) టాప్-2లో కొనసాగుతున్నారు. కాగా గాలే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో కరుణ రత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 187 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. కెప్టెన్ కరుణ రత్నే తొలి ఇన్నింగ్స్‌లో 147, రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Babar Azam- Ban Vs Pak: నేను ప్రతిసారీ పరుగులు సాధించాలని ఎక్కడా రాసిలేదు.. కచ్చితంగా రాణిస్తా -
లంక స్పిన్నర్ల ప్రతాపం.. తొలి టెస్టులో వెస్టిండీస్ ఘోర పరాజయం
Sri Lanka Won By 187 Runs Vs West Indies 1st Test.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ 160 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్స్‌లో క్రుమ్హా బానర్ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోషువా డిసిల్వా 54 పరుగులు చేయగా.. మిగిలిన 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లతో సత్తా చాటగా.. లసిత్ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులతో మెరిసిన కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు నవంబర్ 29 నుంచి జరగనుంది. శ్రీలంక: తొలి ఇన్నింగ్స్ 308 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 191/4 వెస్టిండీస్: తొలి ఇన్నింగ్స్ 230 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 160 ఆలౌట్ -
T20 WC: అతడికి ఐపీఎల్ వేలంలో మంచి డిమాండ్ ఉంటుంది!
Aakash Chopra feels IPL teams will be interested in buying This Player: శ్రీలంక యువ క్రికెటర్ చరిత్ అసలంక టీ20 వరల్డ్‌కప్-2021లో సత్తా చాటాడు. ఇప్పటి వరకు టోర్నీలో 6 ఇన్నింగ్స్ ఆడిన 24 ఏళ్ల అసలంక 231 పరుగులు చేశాడు. తద్వారా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ప్రపంచకప్-2021లో రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు అసలంక. ముఖ్యంగా నవంబరు 4 నాటి వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో.. 68 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా క్రీడా ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చరిత్ అసలంక గురించి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని ఈ శ్రీలంక బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు. రానున్న ఐపీఎల్ వేలంలో అసలంక కోసం ఫ్రాంఛైజీలు తప్పక ఆసక్తి చూపుతాయని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు... ‘‘ చరిత్ అసలంక రియల్ డీల్. టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అతడిని దక్కించుకునేందుకు.. వేలంలో ఐపీఎల్ జట్లు ఆసక్తి కనబరుస్తాయని భావిస్తున్నాను’’ అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లలో వరుస విజయాలు నమోదు చేసి సూపర్ 12 కు అర్హత సాధించిన శ్రీలంక జట్టు.. సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. సూపర్ 12 రౌండ్లో 5 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి నాకౌట్ దశలోనే వెనుదిరిగింది. చదవండి: Chris Gayle: ఏంటిది గేల్.. చెత్త రికార్డు...ఇన్ని ఘనతలు ఉన్నా.. శ్రీలంకపై మాత్రం.. Charith Asalanka is a real-deal. I expect a few #IPL teams setting their eyes on acquiring him at the auctions. #T20WorldCup #WIvSL — Aakash Chopra (@cricketaakash) November 4, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Chris Gayle: ఏంటి గేల్... ఈ చెత్త రికార్డు...ఇన్ని ఘనతలు ఉన్నా.. శ్రీలంకపై మాత్రం
Chris Gayle Bad Record In T20s Against Srilanka: క్రిస్ గేల్.. యూనివర్సల్ బాస్.. సిక్సర్ల వీరుడు... విధ్వంసకర బ్యాటర్.. టీ20 ఫార్మాట్లో అతడికి తిరుగే లేదు... అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలు లీగ్ మ్యాచ్‌ల దాకా పొట్టి క్రికెట్లో గేల్ సాధించిన ఘనతలు అనేకం. టీ20 ప్రపంచకప్-2021 ఆరంభానికి ముందు వరకు క్రిస్ గేల్ 446.. టీ20 మ్యాచ్‌లు ఆడి.. 14261 పరుగులు సాధించాడు. వీటిలో 22 శతకాలు. అత్యధిక స్కోరు 175(నాటౌట్). అంతేకాదు 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో గేల్ సభ్యుడు. పొట్టి ఫార్మాట్లో ఇన్ని ఘనతలు సాధించిన క్రిస్ గేల్‌కు శ్రీలంకపై మాత్రం ఓ చెత్త రికార్డు ఉంది. ఇప్పటి వరకు లంకతో ఆడిన 9 టీ20 మ్యాచ్‌లలో గేల్ అత్యధిక స్కోరు 63(నాటౌట్) కాగా.. మిగిలిన 8 సందర్భాల్లో ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా 5, 2, 3, 3, 0, 16, 13 పరుగులు చేశాడు. తాజాగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా నవంబరు 4న షనక బృందంతో మ్యాచ్‌లో 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఈ జాబితాలో మరో అంకెను పెంచుకున్నాడు. ఇక నవంబరు 4 నాటి మ్యాచ్‌లో నికోలస్ పూరన్(46), షిమ్రన్ హెట్మెయిర్(81) మినహా డిఫెండింగ్ చాంపియన్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో 20 పరుగుల తేడాతో లంక చేతిలో ఓడిన డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీ20 మ్యాచ్‌లలో శ్రీలంకపై గేల్ చెత్త రికార్డు: ►వరుసగా 63 నాటౌట్, 5, 2, 3, 3, 0, 16, 13, 1 పరుగులు. చదవండి: AUS VS BAN: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC WI Vs SL: వాళ్లిద్దరు మినహా.. డిఫెండింగ్ చాంపియన్.. 1,8,9, 2,0,8,2,1
Sri Lanka Beat West Indies By 20 Runs WI Out Of Tourney: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అబుదాబి వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయి ఈవెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పొలార్డ్ బృందం.. లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి శ్రీలంక 189 పరుగులు చేసింది. ఆండ్రీ రసెల్‌కు రెండు, బ్రావోకు ఒక వికెట్ దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా విండీస్‌కు ఓపెనర్లు క్రిస్ గేల్(1), ఎవిన్ లూయీస్(8) దారుణంగా విఫలమయ్యారు. నికోలస్ పూరన్(46) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా... షిమ్రన్ హెట్మెయిర్(81) ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే అర్ధ సెంచరీతో మెరిసి అజేయంగా నిలిచినా... జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. రసెల్(2), పొలార్డ్(0), జేసన్ హోల్డర్(8), డ్వేన్ బ్రావో(2), అకేల్ హొసేన్(1) కనీసం పది పరుగులు కూడా చేయలేక చకచకా పెవిలియన్ చేరడంతో రెండుసార్లు పొట్టిఫార్మాట్ ప్రపంచకప్ విజేత అయిన విండీస్‌కు ఓటమి తప్పలేదు. బినుర ఫెర్నాండో రెండు వికెట్లు, దుష్మంత చమీర ఒకటి, చమిక కరుణరత్నే రెండు, కెప్టెన్ దసున్ షనక ఒకటి, వనిందు హసరంగ రెండు వికెట్లు తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించారు. ఫలితంగా యువ ఆటగాళ్లతో కూడిన శ్రీలంక జట్టు చేతిలో డిఫెండింగ్ చాంపియన్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలై నాకౌట్ దశలోనే చేతులెత్తేసింది. ఇక ఇప్పటికే 5 మ్యాచ్‌లలో మూడింటిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక.. విండీస్‌కు కూడా తమలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది. చరిత్ అసలంక(41 బంతుల్లో 68 పరుగులు, 8 ఫోర్లు, ఒక సిక్సర్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: శ్రీలంక- 189/3 (20) వెస్టిండీస్- 169/8 (20) చదవండి: AUS VS BAN: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గనిస్తాన్ సరసన T20 WC 2021: సెమీస్ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WI Vs SL: హెట్‌మైర్ పోరాటం వృథా.. 20 పరుగుల తేడాతో శ్రీలంక విజయం
హెట్‌మైర్ పోరాటం వృథా.. 20 పరుగులు తేడాతో శ్రీలంక విజయం వెస్టిండీస్‌పై శ్రీలంక 20 పరుగులు తేడాతో విజయం సాధించింది. 190పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవరల్లో 169 పరుగులకే పరిమితమైంది. హెట్‌మైర్( 81) చివర వరకు పోరాడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో సెమీస్ రేస్ నుంచి వెస్టిండీస్ తప్పుకుంది. శ్రీలంక బౌలర్లలో బినూర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిస్సాంక, అసలంక ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో నీర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది.వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లు, బ్రావో వికెట్ సాధించాడు. నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ .. పూరన్(46) ఔట్ 77 పరుగుల వద్ద పూరన్ రూపంలో వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన పూరన్, చమీరా బౌలింగ్‌లో డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 12 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెట్‌మైర్(20), రస్సెల్(1) ఉన్నారు. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 190పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. క్రిస్‌గేల్(1), లూయిస్(8)ను ఒకే ఓవర్లో బినూర ఫెర్నాండో పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ చేజ్(0),పూరన్(24) ఉన్నారు. చేలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. వెస్టిండీస్ టార్గెట్190 పరుగులు నిస్సాంక, అసలంక ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో శ్రీలంక నీర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(51),అసలంక(68) కుసల్ పెరీరా(29) పరుగులు సాధించారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లు, బ్రావో వికెట్ సాధించాడు. నిస్సాంక ఆర్ధసెంచరీ.. శ్రీలంక...14 ఓవర్లకు 120/1 సమయం: 20:50 శ్రీలంక ఓపెనర్ నిస్సాంక ఆర్ధసెంచరీతో చేలరేగాడు. 15 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(51), అసలంక(47) పరుగులతో క్రీజులో ఉన్నారు. అదరగోడుతున్న శ్రీలంక...14 ఓవర్లకు 120/1 వెస్టిండీస్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో శ్రీలంక దుమ్మురేపుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(45), అసలంక(42) పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న శ్రీలంక... 10 ఓవర్లుకు 82/1 సమయం: 20:20 వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక నిలకడగా ఆడుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(24), అసలంక(26) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుసల్ పెరీరా(29) ఔట్: సమయం: 20:00 వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కుసల్ పెరీరా రూపంలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగలు చేసిన పెరీరా, రస్సెల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక(12), అసలంక(5) పరుగులతో క్రీజులో ఉన్నారు. అబుదాబి: టి20 ప్రపంచకప్-2021 సూపర్ 12లో భాగంగా గ్రూప్ 1లో గురువారం(నవంబర్4) వెస్టిండీస్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఢిపిండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ వరుస ఓటమిలతో సెమీస్ అవకాశాలను ఇప్పటికే సంక్లిష్టం చేసుకుంది. అయితే మునపటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం కరీబీయన్లకు కాస్త ఊరటను ఇచ్చింది. ఇక శ్రీలంక ఈ టోర్నమెంట్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 3ఓటమిలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ముఖాముఖి 7 సార్లు తలపడగా శ్రీలంక 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వెస్టిండీస్ రెండు సార్లు విజయం సాధించింది. వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, రవి రాంపాల్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా(వికెట్ కీపర్) చరిత్ అసలంక, భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, బినూర ఫెర్నాండో చదవండి: ICC Player Of The Month: షకీబ్, ఆసిఫ్, డేవిడ్.. టీమిండియా ఆటగాళ్లు ఒక్కరూ లేరు -
దుమ్మురేపిన బ్రావో.. విండీస్‌దే సిరీస్
నార్త్ సౌండ్: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. హసరంగ (80 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాషెన్ బండార (55 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం విండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసి గెలిచింది. ఐదేళ్ల తర్వాత డారెన్ బ్రావో (102; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) వన్డేల్లో మరో సెంచరీ సాధించాడు. షై హోప్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రావో... షై హోప్‌తో మూడో వికెట్‌కు 109 పరుగులు, పొలార్డ్‌తో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షై హోప్ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో కనీసం అర్ధ సెంచరీ చేసిన పదో క్రికెటర్‌గా, విండీస్ నుంచి గార్డన్ గ్రీనిడ్జ్, క్రిస్ గేల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: టీమిండియాకు జరిమానా.. కోవిడ్ తర్వాత మూడోసారి -
అఫ్ఘనిస్తాన్ తరఫున తొలి టెస్టు క్రికెటర్‌గా
అబుదాబి: హష్మతుల్లా షాహిది అఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టెస్టులో అజేయ డబుల్ సెంచరీ (443 బంతుల్లో 200 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) సాధించడం ద్వారా అఫ్ఘనిస్తాన్ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అతడితో పాటు కెపె్టన్ అస్గర్ అఫ్గాన్ కూడా శతకం (257 బంతుల్లో 164; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాదడంతో... ఓవర్‌నైట్ స్కోరు 307/3తో రెండో రోజు ఆట కొనసాగించిన అఫ్ఘనిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 545 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హష్మతుల్లా, అస్గర్ నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే గురువారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్‌నష్టపోకుండా 50 పరుగులు చేసింది. చదవండి: పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు.. తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం నార్త్‌సౌండ్: వికెట్ కీపర్ షై హోప్ సెంచరీ (133 బంతు ల్లో 110; 12 ఫోర్లు, 1 సిక్స్)కి ఎవిన్ లూయిస్ బాధ్యతాయుత బ్యాటింగ్ (65) తోడవ్వడంతో శ్రీలంకతో ఆరంభమైన వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధ రాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో విండీస్ జట్టు 8 వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. దనుష్క గుణతిలక (55), దిముత్ కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షై హోప్, లూయిస్ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించి విండీస్‌కు శుభారం భం అందించారు. చివర్లో డారెన్ బ్రావో (37 నాటౌట్) రాణించడంతో విండీస్‌కు విజయం దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే నేడు జరుగుతుంది. చదవండి: 2025లోనా.. ఇంకెవరు నేనే ఉంటా: జడేజా -
ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి
నార్త్‌సౌండ్: వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఓపెనర్ గుణతిలక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది.అయితే ఒక ఆటగాడు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వన్డేల్లో ఔటవ్వడం ఇది ఏడోసారి. ఇంతకముందు వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో ఒకసారి.. టీ20ల్లో ఒకసారి బ్యాట్స్‌మన్ ఈ పద్దతిలో ఔటయ్యాడు.అతను కావాలని అలా చేశాడో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ నిబంధనల ప్రకారం గుణతిలకను అవుట్‌గా ప్రకటించారని మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (55), కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, జాసన్ మొహమ్మద్ 2, పొలార్డ్ , పాబియెన్ అలెన్, జోసెఫ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షై హోప్ 110 పరుగులతో ఆకట్టుకోగా.. ఎవిన్ లూయిస్ 65 అతనికి సహకరించాడు. ఈ విజయంతో విండీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 12న జరగనుంది. చదవండి: 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 -
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. యూ బ్యూటీ: యువీ
అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ సరికొత్త రికార్డుపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘‘సిక్స్ సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం.. యూ బ్యూటీ’’అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా స్వదేశంలో శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20లో పొలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. లంక ఆటగాడు అకిల ధనుంజయ బౌలింగ్‌లో ఈ రికార్డు సృష్టించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన తొలి విండీస్ క్రికెటర్‌గా, పొట్టి ఫార్మాట్ చరిత్రలో రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇక ఇంతకు ముందు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో సిక్స్ సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సిక్స్ సిక్సర్ల విశేషాలు ►ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా వెస్టిండీస్ సూపర్‌స్టార్ కీరన్ పొలార్డ్ నిలిచాడు. ►శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత దక్కించుకున్నాడు. ►లంక బౌలర్ అకిల ధనంజయ బౌలింగ్‌లో ఈ రికార్డు సాధించాడు. ►ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ చరిత్రకెక్కాడు. ►ఐసీసీ వరల్డ్ కప్-2007లో భాగంగా గిబ్స్ ఈ ఘనత సాధించాడు. ►నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బంగే బౌలింగ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. ►టీ20 చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ►టీ20 ప్రపంచకప్-2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ►స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి యువీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్ Take a bow Skipper!🔥 🔥 🔥 🔥 🔥 🔥 The 1st West Indian to hit 6️⃣ sixes in an over in a T20I!🤯 #WIvSL #MenInMaroon Live Scorecard⬇️ https://t.co/MBDOV534qQ pic.twitter.com/etkxX7l7bq — Windies Cricket (@windiescricket) March 4, 2021 -
పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్
ఆంటిగ్వా: వెస్టిండీస్, శ్రీలంక మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లో స్కోరింగ్ మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అయితే పొలార్డ్ రికార్డు ముందు రెండో రికార్డ్ పాపులర్ అవలేదు. అసలు విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనుంజయ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ధనుంజయ మూడు వరుస బంతుల్లో ఓపెనర్ ఎవిన్ లూయిస్(28 పరుగులు), క్రిస్ గేల్( 0 పరుగులు), నికోలస్ పూరన్(0 పరుగులు)లను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. తద్వారా లంక తరపున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా ..ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు లంక నుంచి లసిత్ మలింగ రెండుసార్లు(2017,2019), తిసారా పెరీరా( 2016) హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. అయితే హ్యాట్రిక్ తీసిన ఆనందం ధనుంజయకు ఎంతోసేపు నిలవలేదు. విండీస్ విధ్వంసం కీరన్ పొలార్డ్ ధనుంజయ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా.. అదే విధంగా టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ పొలార్డ విధ్వంసంతో 13.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 5న ఆంటిగ్వా వేదికలోనే జరగనుంది. చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు -
పూరన్ వెనుక పుట్టెడు దుఃఖం
నికోలస్ పూరన్.. వెస్టిండీస్ వికెట్ కీపర్ కమ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విండీస్ జట్టు నుంచి ఎగిసిపడిన మరో యువకెరటం. శ్రీలంకతో మ్యాచ్ వరకు పెద్దగా పరిచయంలేని ఆటగాడు. ఆ మ్యాచ్‌లో ఓవైపు వికెట్లు పడుతున్నా కడవరకు పోరాడిన శతకవీరుడు. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ పూరన్ ఓ పడిలేచిన కెరటం. అతని వెనుక పుట్టెడు దుఃఖం ఉంది. 7 నెలలు మంచానికే పరిమితమైన విషాద గాధ ఉంది. 2015లో ట్రినిడాడ్‌లో రోడ్డుప్రమాదానికి గురైన పూరన్.. సుమారు 7 నెలలు మంచానికే పరిమితమయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరగడమే కాక నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. అయితే, ఈ ప్రమాదం అతడి క్రికెట్ జీవితాన్ని అనిశ్చితిలో పడేసినా, తిరిగి క్రికెట్ ఆడాలన్న అతడి దృఢసంకల్పాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. పలు సర్జరీలు, ఫిజియోథెరపీ తర్వాత ఆ ఏడాది జూలైలో మెల్లిగా నడక మొదలు పెట్టాడు. నెల తిరిగే సరికి పరుగెత్తడం ప్రారంభించాడు. తిరిగి బ్యాట్ పట్టి ఒక్కో అడుగు వేసుకుంటూ, ఒక్కో పరుగు సాధిస్తూ పూర్తి ఫిట్నెస్ సాధించి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. నేను క్రికెట్ ఆడగలనా? ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రమాద ఘటన విషయాలను తెలియజేసిన పూరన్.. తనకు స్పృహ వచ్చిన తర్వాత తన నోట వచ్చిన మొదటి మాట.. ‘డాక్టర్స్..నేను క్రికెట్ ఆడగలనా?’ అని ప్రశ్నించినట్లు నాటి భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ‘నా శిక్షణను ముగించుకొని కారులో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరాను. మా ఇంటికి దగ్గరకు రాగానే నా కారును మరో కార్ ఓవర్టేక్ చేస్తూ వెళ్లడంతో నేను కొంచెం దూరంగా వెళ్లాను. కానీ నా కారు ఇసుక కుప్పను తాకింది. నేను కారులో నుంచి బయటపడగానే మరో వాహనం నన్ను ఢీకొట్టింది. ఆ తర్వాత నాకేం జరిగిందో గుర్తులేదు. నాకు స్పృహ రాగానే.. షాక్‌కు గురయ్యాను. నన్ను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ప్రమాదం జరిగిందని గ్రహించాను. కానీ ఎలా జరిగిందో తెలియడం లేదు. కాళ్లు కదలడం లేదు. అందరూ కాళ్ల వేళ్లు కదిలించమని చెబుతున్నారు. కానీ నేను నా మోకాలిని కూడా కదలించలేకపోతున్నాను. ఎదో తప్పు జరిగిందని గ్రహించాను. వెంటనే డాక్టర్లను నేను క్రికెట్ ఆడగలనా? అని అడిగాను’ అని పూరన్ తన ప్రమాదం గురించి చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విండీస్ జట్టులో చోటు దక్కించుకున్న ఈ 23 ఏళ్ల క్రికెటర్.. తొలి ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీ.. శ్రీలంకతో సెంచరీ.. అఫ్గాన్‌పై అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మిడిలార్డర్లో విండీస్ జట్టుకు వెన్నెముకలా మారాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలిపించేంత పనిచేశాడు. 103 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 118 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు. జట్టు ఓడినా అతడి ఆట తీరుకు యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అయ్యింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం పూరన్ మాట్లాడుతూ..‘ఈ టోర్నీలో మేం అంతగా రాణించలేకపోవచ్చు. కానీ ఓ ఆటగాడు విజయం కన్నా ఓటమితోనే ఎక్కువ నేర్చుకుంటాడు. మేం కూడా ఈ టోర్నీ ద్వారా చాలా నేర్చుకోవడంతో పాటు అనుభవాన్ని సంపాధించాం. మాది యువ జట్టు. నాలాగే హెట్‌మైర్,హోప్, అలెన్‌లు చాలా నేర్చుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్ అభిమానులు.. పూరన్‌ను దిగ్గజం బ్రయాన్ లారాతో పోల్చడం మొదలుపెట్టారు. కానీ పూరన్ మాత్రం ఎవరితో పోల్చోకోదల్చుకోలేదని, తనలానే ఉంటానని పేర్కొన్నాడు. -
‘తొలి అడుగు టీమిండియా సిరీస్‌తోనే’
చెస్టర్ లీ స్ట్రీట్ : మొన్నటివరకు ఎవరికీ తెలియని నికోలస్ పూరన్.. ఒక్క ఇన్నింగ్స్‌తో హీరో అయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో కరేబియన్ స్టార్ ఆటగాళ్లు విఫలమైనా.. నికోలస్ పట్టువదలని విక్రమార్కుడిలా శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించినంత పనిచేశాడు. అయితే చివర్లో లంక బౌలర్లు రాణించడంతో ప్రపంచకప్‌లో విండీస్ వరుసగా ఆరో ఓటమి చవిచూసింది. అయితే నికోలస్ ఒంటరి పోరాటానికి విండీస్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నెటిజన్లు ఇప్పుడే అతడిని విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారాతో పోల్చుతున్నారు. కాగా, ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో కరేబియన్ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారని భావించినా అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే గెలుపుకంటే ఓటమితో ఎన్నో నేర్చుకుంటామని శతక వీరుడు నికోలస్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు. ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగబోయే సిరీస్‌లో తమ ప్రతాపాన్ని చూపుతామని నికోలస్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను ఆ సిరీస్‌లో పునరావృతం చేయబోమని, విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. (చదవండి: 8 నెలల తర్వాత బౌలింగ్.. తొలి బంతికే.!) ‘ప్రపంచకప్‌లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఓ ఆటగాడిగా చెప్పాలంటే.. గెలుపులో కంటే ఓటమిలోనే ఎక్కువ విషయాలను నేర్చుకోవచ్చు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లోనూ(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక) గెలుపు చివరంచున బోల్తా పడ్డాము. ప్రస్తుతం జట్టులో చాలా మంది యువకులమే ఉన్నాము. ఈ టోర్నీతో చాలా నేర్చుకున్నాము. ఇక నా వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడే నన్ను ఒకరితో(బ్రయాన్ లారా) పోల్చడం తగదు. టీమిండియాతో త్వరలో జరగబోయే సిరీస్‌పై దృష్టి పెడతాం. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను టీమిండియా సిరీస్‌లో పునరావృతం చేయబోము. విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తాం. దానికి తొలి అడుగు ఈ సిరీస్‌తోనే మొదలెడతాం’అంటూ నికోలస్ వ్యాఖ్యానించాడు. -
పాప్ స్టార్ రిహానాతో క్రిస్ గేల్!
-
పాప్ స్టార్‌తో క్రిస్ గేల్!
చెస్టర్ లీ స్ట్రీట్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా రివర్ సైడ్ స్టేడియంలో సోమవారం వెస్టిండీస్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అనుకోని అతిథి హాజరయ్యారు. బార్బోడాస్ వెండితెరపై తళుకులీనుతున్న రిహానా మ్యాచ్‌ను చూడటానికి వచ్చి అభిమానుల్ని అలరించారు. స్టార్ నటిగా, సింగర్‌గా టాప్ మోడల్‌గా ఉన్న ఆమె.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో సందడి చేశారు. అభిమానులతో సెల్ఫీ దిగారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రధానంగా వెస్టిండీస్ క్రికెటర్ల బ్యాటింగ్‌ను తిలకిస్తూ చాలాసేపు వీఐవీ బాక్స్‌లో గడిపారు. మ్యాచ్ మొత్తానికి ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మ్యాచ్ ముగిసిన అనంతరం క్రిస్ గేల్, బ్రాత్‌వైట్‌లను కలుసుకున్నారు. స్వయంగా ఆమె వెస్టిండీస్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. క్రిస్‌గేల్‌ను కలుసుకున్నారు. అతనితో ఫొటో దిగారు. వెస్టిండీస్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పూరన్ సిక్సర్‌తో సెంచరీ మార్క్‌ను అందుకున్న తరువాత అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె హావభావాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పరాజయం పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. లక్ష్యాన్ని ఛేదించడానికి వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు అసాధారణంగా పోరాడారు. ప్రత్యేకించి- వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పూరన్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్ ఆడాడు. ఓ దశలో మ్యాచ్‌ను వెస్టిండీస్ వైపు తిప్పుకొన్నాడు కూడా. దురదృష్టం వెంటాడింది. లక్ష్యానికి చేరువగా వెళ్లిన సమయంలో పూరన్ అవుట్ అయ్యాడు. ఫలితంగా మ్యాచ్ వెస్టిండీస్ చేజారింది. -
8 నెలల తర్వాత బౌలింగ్.. తొలి బంతికే.!
చెస్టర్ లీ స్ట్రీట్ : ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యుస్ మరోసారి నిరూపించాడు. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడెప్పుడో బౌలింగ్ చేసిన మాథ్యుస్ సరిగ్గా 8 నెలల తర్వాత క్లిష్ట సమయంలో బంతిని అందుకొని తొలి బంతికే కీలక వికట్ పడగొట్టి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (103 బంతుల్లో 118; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత శతకంతో గెలుపు దిశగా తీసుకెళ్లాడు. విండీస్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు కావాల్సి ఉండగా.. క్రీజులో సెంచరీ హీరో పూరన్‌తో షెల్డాన్ కాట్రెల్‌లు ఉన్నారు. పూరన్ దూకుడు చూసి విండీస్ విజయం ఖాయమని భావించారు. కానీ అనూహ్యంగా బంతిని అందుకున్న మాథ్యుస్ తొలి బంతికే అతడిని పెవిలియన్ చేర్చాడు. ఆఫ్‌స్టంప్ దిశగా వేసిన బంతిని పూరన్ కవర్స్ దిశగా ఆడాలని ప్రయత్నించగా.. అది కాస్త బ్యాట్‌కు ఎడ్జై కీపర్ కుసాల్ పెరెరా చేతిలో పడింది. అంతే శ్రీలంక ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది. అయితే మ్యాచ్ అనంతరం ఈ వికెట్‌పై మాథ్యూస్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ గత 8 నెలలుగా నేను బౌలింగ్ చేయని విషయం మీకు తెలిసిందే. ఇది నేను 8 నెలల తర్వాత వేసిన తొలి బంతి. మేం గెలవాలంటే రెండు ఓవర్లు జాగ్రత్తగా వేయాలి. విధ్వంసకరంగా ఆడుతున్న పూరన్ ఉండగా స్పిన్నర్లతో వేయించలేం. ఇలాంటి క్లిష్టసమయంలో నేను మా కెప్టెన్ దగ్గరకు వెళ్లి.. నాకు ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తానని చెప్పాను. దీనికి సానుకూలంగా స్పందించిన కెప్టెన్ నాకు అవకాశం ఇచ్చాడు’ అని మాథ్యూస్ చెప్పుకొచ్చాడు. ఇక రెండు ఓవర్లు వేసిన మాథ్యుస్ కేవలం 6 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి : లంక విజయం -
లంక గెలిచే.. ఆనందం విరిసె
చెస్టర్ లీ స్ట్రీట్ : ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. ఈ టోర్నీలో తొలి సారి బ్యాటింగ్‌లో అదరగొట్టిన లంకేయులు ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న లంకేయులకు ఈ విజయం ఆనందం కలిగించేదే. సోమవారం రివర్సైడ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో కరేబియన్ జట్టుపై 23 పరుగుల తేడాతో లంక జయభేరి మోగించింది. సింహళీయులు నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఆటగాళ్లలో నికోలస్ పూరన్(118; 103 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో రాణించినప్పటికీ కీలక సమయంలో అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు. పూరన్‌కు తోడుగా ఫాబియన్ అలెన్(51) అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లలో మలింగ మూడు వికెట్లతో రాణించాడ. తన శతకంతో లంక భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన అవిష్క ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నికోలస్ ఒక్కడే.. లక్ష్యఛేదనలో విండీస్ తడబడింది. విజయానికి అవసరమయ్యే భారీ భాగస్వామ్యాలను నమోదు చేయడంలో విండీస్ టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. దీంతో 199 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి భారీ ఓటమికి విండీస్ దగ్గర్లో నిలిచింది. అయితే నికోలస్ పూరన్- అలెన్ జోడి ఎనిమిదో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో కరేబియన్ జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అర్దసెంచరీ సాధించిన అనంతరం అనవసరంగా అలెన్ రనౌట్ అవ్వడం, శతకం పూర్తయిన వెంటనే నికోలస్ వెనుదిరగడంతో విండీస్ ఓటమి ఖాయం అయింది. అంతకుముందు శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో (104;103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు కుశాల్ పెరీరా (64; 51 బంతుల్లో 8 ఫోర్లు), తిరుమన్నే(45 నాటౌట్; 33 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు సాధించగా, కాట్రెల్, థామస్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ తీశారు. తలో చేయి వేశారు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించింది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే(32: 48 బంతుల్లో 4 ఫోర్లు), కుశాల్ పెరీరా జోడీ తొలి వికెట్‌కు 93 పరుగులు జతచేసింది. ఈ తరుణంలో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటయ్యాక అవిష్క, కుశాల్ మెండిస్(39: 41 బంతుల్లో 4 ఫోర్లు) మరో ఉపయుక్త భాగస్వామ్యం(85) ఏర్పరిచింది. దీంతో లంక భారీ స్కోరు దిశగా పయనిం చింది. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్(26)తో కలసి ఫెర్నాండో మరో 55 పరుగులు జత చేశాడు. ఉదాన(3) నిరాశపరిచాడు. చివర్లో తిరిమన్నే స్ట్రైక్‌రొటేట్ చేస్తూ సమయోచితంగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో స్కోరు 300 దాటింది. -
చితక్కొట్టిన లంకేయులు
చెస్టర్ లీ స్ట్రేట్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పవరకూ బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపుల్లేని శ్రీలంక.. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయింది. ఆది నుంచి కడవరకూ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న లంకేయులు 339 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. అవిష్క ఫెర్నాండో(104;103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో రాణించగా, కుశాల్ పెరీరా(64; 51 బంతుల్లో 8 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. లహిరు తిరిమన్నే(45 నాటౌట్; 33 బంతుల్లో 4 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో లంక భారీ స్కోరు చేసింది.టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించింది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే- కుశాల్ పెరీరాల జోడి లంకకు చక్కటి ఆరంభాన్ని అందించింది. వీరిద్దరూ 93 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కరుణరత్నే తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో కుశాల్ పెవిలియన్ చేరినప్పటికీ అవిష్క ఫెర్నాండో-కుశాల్ మెండిస్‌ల జోడి ఇన్నింగ్స్‌ను సమయోచితంగా నడిపించింది. ఈ జోడి మూడో వికెట్‌కు 85 పరుగులు జత చేయడంతో లంక భారీ స్కోరు దిశగా పయనించింది. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్(26)తో కలిసి ఫెర్నాండో మరో 55 పరుగులు జత చేశాడు. చివర్లో తిరిమన్నే స్ట్రైక్‌రొటేట్ చేస్తూ సమయోచితంగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు సాధించగా, కాట్రెల్, థామస్, ఫాబియన్ అలెన్‌లు తలో వికెట్ తీశారు. -
అరే.. ఏం క్యాచ్‌రా ఇది!
చెస్టర్ లీ స్ట్రీట్ : వెస్టిండీస్ ఆల్‌రౌండర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఫాబియన్ అలెన్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్‌ను మెస్మరైజ్ క్యాచ్‌తో ఔట్ చేసి అలెన్ ఆకట్టుకున్నాడు. సోమవారం రివర్సైడ్ గ్రౌండ్లో శ్రీలంక ఇన్నింగ్స్ సందర్బంగా ఈ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఫాబియన్ అలెన్ వేసిన 32వ ఓవర్ చివరి బంతిని కుశాల్.. బౌలర్‌కు కుడి భాగం నుంచి దూరంగా డ్రైవ్ ఆడాడు. అయితే బ్యాట్స్‌మన్ ఊహించిన దాని కంటే బంతి ఎక్కువగా గాల్లోకి లేచింది. అయితే ఎవరూ ఊహించని విధంగా అలెన్ గాల్లోకి ఎగిరి రెండు చేతులా బంతిని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కుశాల్ షాక్‌కు గురై భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ఇక అలెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో శ్రీలంకతో సహా కరేబియన్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అలెన్ స్టన్నింగ్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పటికే వెస్టిండీస్ ఆటగాళ్లు కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌లు అందుకున్నారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కరేబియన్ ఫాస్ట్ బౌలర్ కాట్రెల్ బ్రిలియంట్ క్యాచ్‌తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.