శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. రోవ్‌మన్ పావెల్ సారథ్యంలో టీ20 జట్టు.. షాయీ హోప్ కెప్టెన్సీలో వన్డే జట్టు లంక పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపింది. స్టార్ ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కానుండగా.. ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఈ జట్లలో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది.
కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్టోబరు 13- 26 మధ్య మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు శనివారం జట్లను ప్రకటించిగా.. టీ20 జట్టులో కొత్తగా టెర్రెన్స్ హిండ్స్, షామార్ స్ప్రింగర్ చోటు దక్కించుకున్నారు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటి
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024(సీపీఎల్)లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రైటార్మ్ పేసర్ హిండ్స్.. ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక స్ప్రింగర్ కూడా కుడిచేతి వాటం పేసరే. 18 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.
వీరిద్దరితో పాటు.. పదిహేడేళ్ల వికెట్ కీపర్ జువెల్ ఆండ్రూకు కూడా విండీస్ సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. అయితే, అతడిని వన్డే జట్టుకు ఎంపిక చేయడం గమనార్హం. జువెల్ ఇప్పటి వరకు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లలో కలిపి 165 పరుగులు సాధించాడు.
స్టార్లు దూరం.. యువ ఆటగాళ్ల పాలిట వరం
శ్రీలంకతో సిరీస్‌లకు విధ్వంసకర వీరులు నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, షిమ్రన్ హెట్‌మెయిర్, స్పిన్నర్ అకీల్ హొసేన్ దూరమయ్యారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో వీరంతా విశ్రాంతి కావాలని కోరగా.. అందుకు తాము సమ్మతించినట్లు వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ చెప్పాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, అలిక్ అథనేజ్, ఆండ్రీ ఫ్లెచర్, టెర్రెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షామార్ స్ప్రింగర్
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
షాయీ హోప్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జువెల్ ఆండ్రూ, అలిక్ అథనేజ్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్.
చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment