
చెస్టర్ లీ స్ట్రీట్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తొలుత లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్ ఏడు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో సెమీస్ రేసు నుంచి ముందుగానే నిష్క్రమించింది. మరొకవైపు శ్రీలంక ఏడు మ్యాచ్‌లు ఆడి రెండింటలో మాత్రమే గెలుపొందింది.
వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో ఆ జట్టు ఆరు పాయింట్లతో ఉంది. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవడంతో శ్రీలంక సెమీస్ అవకాశాలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంక-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నామమాత్రంగా మారింది. దాంతో ఇరు జట్లు పరువు కోసం మాత్రమే బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్ల మధ్య వన్డే ముఖాముఖి రికార్డులో 56 మ్యాచ్‌లు జరగ్గా విండీస్ 28 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, లం 25 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక వరల్డ్‌కప్ సమరంలో ఆరు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలపడగా విండీస్ నాల్గింట గెలుపొందగా, లంక రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.