
శ్రీలంకపై క్రిస్ గేల్ చెత్త రికార్డు... మరీ సింగిల్ డిజిట్లతో..
Chris Gayle Bad Record In T20s Against Srilanka: క్రిస్ గేల్.. యూనివర్సల్ బాస్.. సిక్సర్ల వీరుడు... విధ్వంసకర బ్యాటర్.. టీ20 ఫార్మాట్‌లో అతడికి తిరుగే లేదు... అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలు లీగ్ మ్యాచ్‌ల దాకా పొట్టి క్రికెట్‌లో గేల్ సాధించిన ఘనతలు అనేకం. టీ20 ప్రపంచకప్-2021 ఆరంభానికి ముందు వరకు క్రిస్ గేల్ 446.. టీ20 మ్యాచ్‌లు ఆడి.. 14261 పరుగులు సాధించాడు. వీటిలో 22 శతకాలు. అత్యధిక స్కోరు 175(నాటౌట్). అంతేకాదు 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో గేల్ సభ్యుడు.
పొట్టి ఫార్మాట్‌లో ఇన్ని ఘనతలు సాధించిన క్రిస్ గేల్‌కు శ్రీలంకపై మాత్రం ఓ చెత్త రికార్డు ఉంది. ఇప్పటి వరకు లంకతో ఆడిన 9 టీ20 మ్యాచ్‌లలో గేల్ అత్యధిక స్కోరు 63(నాటౌట్) కాగా.. మిగిలిన 8 సందర్భాల్లో ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా 5, 2, 3, 3, 0, 16, 13 పరుగులు చేశాడు.
తాజాగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా నవంబరు 4న షనక బృందంతో మ్యాచ్‌లో 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఈ జాబితాలో మరో అంకెను పెంచుకున్నాడు. ఇక నవంబరు 4 నాటి మ్యాచ్‌లో నికోలస్ పూరన్(46), షిమ్రన్ హెట్‌మెయిర్(81) మినహా డిఫెండింగ్ చాంపియన్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో 20 పరుగుల తేడాతో లంక చేతిలో ఓడిన డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టీ20 మ్యాచ్‌లలో శ్రీలంకపై గేల్ చెత్త రికార్డు:
►వరుసగా 63 నాటౌట్, 5, 2, 3, 3, 0, 16, 13, 1 పరుగులు.
చదవండి: AUS VS BAN: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా