Chris Gayle Retirement From International Cricket.. యునివర్సల్ బాస్.. విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడా? టి20 ప్రపంచకప్ 2021లో విండీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడేశాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 ప్రపంచకప్ 2021 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. తాజగా గేల్ కూడా విండీస్ తరపున చివరి మ్యాచ్ ఆడేశాడంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అయితే గేల్ ఎక్కడా అధికారికరంగా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి అతని చర్యలు చూస్తే అలాగే ఉన్నాయి.
చదవండి: Shoaib Akthar: అఫ్గాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయిందో.. ఇక అంతే
అందుకు తగినట్లుగానే గేల్ తన చివరి మ్యాచ్ అనుకున్నాడేమో.. బ్యాటింగ్ వచ్చేటప్పుడు సన్‌గ్లాసెస్‌తో బరిలోకి దిగాడు. రెండు భారీ సిక్సర్లు కొట్టిన గేల్ 15 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పెవిలియన్ చేరుతూ తన బ్యాట్‌ను పైకి లేపి ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. అనంతరం డగౌట్‌లో ఆండీ రసెల్ అతన్ని కౌగలించుకోవడం.. ఆ తర్వాత గేల్ డగౌట్‌లో తన గ్లోవ్స్‌పై సంతకం చేసి అభిమానులకు పంచడం.. కెమెరా ముందుకు వచ్చి థాంక్యూ ఫ్యాన్స్ అంటూ గట్టిగా అరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గేల్ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.
► ఇప్పటికే వన్డే, టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన గేల్‌కు టి20ల్లో ఘనమైన రికార్డు ఉంది.
► తన కెరీర్‌లో 452 టి20 మ్యాచ్‌లాడిన గేల్ 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అందులో 87 హాఫ్ సెంచరీలు.. 22 సెంచరీలు ఉన్నాయి.
► ఇక వెస్టిండీస్ తరపున గేల్ 79 మ్యాచ్‌ల్లో 1884 పరుగులు సాధించాడు.
► టి20 ప్రపంచకప్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా గేల్ చరిత్రలో నిలిచిపోయాడు.
► 2012, 2016 టి20 ప్రపంచకప్‌లను విండీస్ గెలవడంలో గేల్ కీలకపాత్ర పోషించాడు.
► టి20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గేల్(35 మ్యాచ్‌ల్లో 950 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
► టి20ల్లో వెయ్యికి పైగా సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్‌గా గేల్ చరిత్ర
Last International six of CHRIS HENRY GAYLE 🥺🔥@henrygayle ❤️pic.twitter.com/YkIwVZsyzx
— Harshullah Jadran 🇦🇫 (@INVINCIBLE45_) November 6, 2021
Chris Gayle! ❤️#WIvsAUS pic.twitter.com/ZpHN3YkZrm
— 'Z (@_NyrraZo) November 6, 2021
Comments
Please login to add a commentAdd a comment