ఆ క్రికెటర్‌పై గౌరవం చచ్చిపోయింది.. గేల్‌ సంచలన వ్యాఖ్యలు | T20 World Cup 2021: Chris Gayle Comments Have Not Respect Curtly Ambrose | Sakshi
Sakshi News home page

Chris Gayle: ఆ క్రికెటర్‌పై గౌరవం చచ్చిపోయింది.. గేల్‌ సంచలన వ్యాఖ్యలు

Published Wed, Oct 13 2021 3:58 PM | Last Updated on Tue, Oct 19 2021 5:59 PM

T20 World Cup 2021: Chris Gayle Comments Have Not Respect Curtly Ambrose - Sakshi

Chris Gayle Sensational Comments On Curtly Ambrose.. వెస్టీండీస్‌ మాజీ దిగ్గజ బౌలర్‌ కర్ట్‌లీ అంబ్రోస్‌పై యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌కు సంబంధించి వెస్టిండీస్‌ జట్టులో క్రిస్‌ గేల్‌ జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని ఎంపిక తనకు నచ్చలేదని... ఫామ్‌లో లేకపోయినప్పటికీ గేల్‌ను అనవసరంగా ఎంపిక చేశారంటూ అంబ్రోస్‌ వారం క్రితం ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. తనకు అవకాశం ఇస్తే గేల్‌ను జట్టులోకి తీసుకునేవాడిని కాదని.. ప్రస్తుతం అతని ఎంపిక అనేది ఒక సీనియర్‌ బ్యాటర్‌గా పరిగణించడంతోనే ఆటోమెటిక్‌గా టి20 ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చాడంటూ విమర్శలు చేశాడు.

చదవండి: Travis Head: ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ సరికొత్త రికార్డు

అంబ్రోస్‌ వ్యాఖ్యలపై గేల్‌ స్పందింస్తూ.. '' నాకు అంబ్రోస్‌ ఉన్న గౌరవం చచ్చిపోయింది. జట్టులోకి నేను కొత్తగా వచ్చినప్పుడు అతనికి నేనిచ్చిన గౌరవం వేరుగా ఉండేది. కానీ ఈరోజు నాపై ఆయన చేసిన వ్యాఖ్యలతో చాలా బాధపడుతున్నా. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటి నుంచి వ్యక్తిగతంగా నాపై మాటల యుద్దం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వ్యాఖ్యలు నా మనసులో నుంచి వచ్చాయి. నాపై నమ్మకముంటేనే కదా జట్టులోకి ఎంపికచేస్తారు. ఫామ్‌లో లేకపోవచ్చు.. కానీ అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటాను. ఒక యునివర్సల్‌ బాస్‌గా ఈరోజుతో కర్ట్‌లీ అంబ్రోస్‌తో తెగదెంపులు చేసుకుంటున్నా. ఒకవేళ అతను నాకు ఎదురుపడితే కూడా ఇదే మాట చెబుతా. నాపై నెగెటివ్‌ ప్రచారం ఆపండి. టి20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌ గెలవాలని కోరుకోండి'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ జట్టుకు ఘనమైన రికార్డు ఉంది. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత వెస్టిండీస్‌కు దక్కింది. 2012, 2016లో టి20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ జట్టులో గేల్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2021 ఏడాది ఆరంభం నుంచి చూసుకుంటే 16 టి20 మ్యాచ్‌లాడి 227 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్‌ సెంచరీ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఐపీఎల్‌ 2021 సీజన్‌ సెకండ్‌ఫేజ్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గేల్‌ ఆ తర్వాత బయోబబుల్‌ను వీడాడు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్‌ ఫామ్‌లోకి వచ్చేందుకు ఒక్క మ్యాచ్‌ చాలు. అతను ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించడం ఖాయం.

చదవండి: T20 WC 2021: కొత్త లుక్‌లో టీమిండియా జెర్సీ.. ఆ మూడు చుక్కలు ఎందుకంటే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement