Curtly Ambrose
-
ఆ క్రికెటర్‌పై గౌరవం చచ్చిపోయింది.. గేల్ సంచలన వ్యాఖ్యలు
Chris Gayle Sensational Comments On Curtly Ambrose.. వెస్టీండీస్ మాజీ దిగ్గజ బౌలర్ కర్ట్లీ అంబ్రోస్‌పై యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌కు సంబంధించి వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని ఎంపిక తనకు నచ్చలేదని... ఫామ్‌లో లేకపోయినప్పటికీ గేల్‌ను అనవసరంగా ఎంపిక చేశారంటూ అంబ్రోస్ వారం క్రితం ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. తనకు అవకాశం ఇస్తే గేల్‌ను జట్టులోకి తీసుకునేవాడిని కాదని.. ప్రస్తుతం అతని ఎంపిక అనేది ఒక సీనియర్ బ్యాటర్‌గా పరిగణించడంతోనే ఆటోమెటిక్‌గా టి20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడంటూ విమర్శలు చేశాడు. చదవండి: Travis Head: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ సరికొత్త రికార్డు అంబ్రోస్ వ్యాఖ్యలపై గేల్ స్పందింస్తూ.. '' నాకు అంబ్రోస్ ఉన్న గౌరవం చచ్చిపోయింది. జట్టులోకి నేను కొత్తగా వచ్చినప్పుడు అతనికి నేనిచ్చిన గౌరవం వేరుగా ఉండేది. కానీ ఈరోజు నాపై ఆయన చేసిన వ్యాఖ్యలతో చాలా బాధపడుతున్నా. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి వ్యక్తిగతంగా నాపై మాటల యుద్దం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వ్యాఖ్యలు నా మనసులో నుంచి వచ్చాయి. నాపై నమ్మకముంటేనే కదా జట్టులోకి ఎంపికచేస్తారు. ఫామ్‌లో లేకపోవచ్చు.. కానీ అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటాను. ఒక యునివర్సల్ బాస్‌గా ఈరోజుతో కర్ట్లీ అంబ్రోస్‌తో తెగదెంపులు చేసుకుంటున్నా. ఒకవేళ అతను నాకు ఎదురుపడితే కూడా ఇదే మాట చెబుతా. నాపై నెగెటివ్ ప్రచారం ఆపండి. టి20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలవాలని కోరుకోండి'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పొట్టి ఫార్మాట్లో వెస్టిండీస్ జట్టుకు ఘనమైన రికార్డు ఉంది. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత వెస్టిండీస్‌కు దక్కింది. 2012, 2016లో టి20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టులో గేల్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2021 ఏడాది ఆరంభం నుంచి చూసుకుంటే 16 టి20 మ్యాచ్‌లాడి 227 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్‌ఫేజ్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గేల్ ఆ తర్వాత బయోబబుల్‌ను వీడాడు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్ ఫామ్‌లోకి వచ్చేందుకు ఒక్క మ్యాచ్ చాలు. అతను ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించడం ఖాయం. చదవండి: T20 WC 2021: కొత్త లుక్‌లో టీమిండియా జెర్సీ.. ఆ మూడు చుక్కలు ఎందుకంటే -
బుమ్రా ఆ ఘనతను కచ్చితంగా సాధిస్తాడు: మాజీ క్రికెటర్
జమైకా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై విండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను టెస్టుల్లో కచ్చితంగా 400 వికెట్ల మార్క్‌ను అందుకుంటాడని ఆంబ్రోస్ జోస్యం చెప్పాడు. ఇటీవలే కర్ట్లీ అండ్ కరీష్మా షోలో పాల్గొన్న ఆంబ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా బౌలింగ్‌కు నేను పెద్ద అభిమానిని. అతని బౌలింగ్ శైలి నాకు కొత్తగా అనిపించింది. బంతిని స్వింగ్ చేస్తూనే డెత్ ఓవర్లలో యార్క్ర్లు సంధిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తిస్తాడు. అతని నైపుణ్యానికి తోడూ అమ్ములపొదిలో ఇంకా చాలా అస్త్రాలు దాగున్నాయి. అవసరం ఉంటేనే అవి బయటికి తీస్తాడు. ఈ మధ్య వరుసగా గాయాలపాలవుతూ బుమ్రా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజమే.. కానీ అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తే మాత్రం ఆపడం ఎవరి తరం కాదు. బుమ్రా క్రికెట్ ఆడినంత కాలం ఆరోగ్యంగా ఉంటూ.. ఫిట్నెస్ కాపాడుకుంటే మాత్రం టెస్టుల్లో కచ్చితంగా 400 వికెట్ల మార్క్‌ను అందుకుంటాడు. అని చెప్పుకొచ్చాడు. ఇక బుమ్రా ఇటీవలే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు మాత్రమే ఆడి నాలుగు వికెట్లు తీశాడు. పెళ్లి కారణాల రిత్యా సిరీస్ మధ్యలోనే వెళ్లిపోయిన బుమ్రా ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ 14వ సీజన్లో బరిలోకి దిగాడు. ఏడు మ్యాచ్‌లాడిన బుమ్రా ఆరు వికెట్లు తీశాడు. ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు బుమ్రా ఎంపికయ్యాడు. ఇక బుమ్రా టెస్టుల్లో ఇప్పటివరకు 19 టెస్టులాడి 83 వికెట్లు తీశాడు. ఇక సర్ కర్ట్లీ ఆంబ్రోస్ 1980,90వ దశకంలో తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. విండీస్ తరపున 98 టెస్టుల్లో 405 వికెట్లు.. 176 వన్డేల్లో 225 వికెట్లు తీశాడు. చదవండి: ఐపీఎల్ వాయిదా: ఆనందంలో సంజన గణేషన్! రాయుడు అరుదైన రికార్డు.. బుమ్రా చెత్త రికార్డు -
‘ఔట్ చేయడానికో, గాయపరచడానికో తెలీదు’
మెల్బోర్న్: వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్‌తో జరిగిన ఒకనాటి పోరు గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మరొకసారి గుర్తు చేసుకున్నాడు. 1995లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జమైకాలో జరిగిన టెస్టు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆంబ్రోస్‌తో ఫైట్‌ను స్టీవ్ వా వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ వా డబుల్ సెంచరీ సాధించి ఒక అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో కెరీర్‌కు బాటలు వేసుకోగా, ఆంబ్రోస్ లాంటి బౌలర్‌ను ఎదురొడ్డి నిలవడం సవాల్‌గా అనిపించిందన్నాడు. ‘ రెండు టెస్టులు ముగిసే సరికే సిరీస్ సమంగా ఉండటంతో మూడో టెస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరి టెస్టు కోసం మార్క్ టేలర్ నేతృత్వంలోని మా జట్టు జమైకాకు వెళ్లింది. ఆ మ్యాచ్‌కు ముందు అప్పటి కోచ్ బాబ్ సింప్సన్ మాటలు మాలో ప్రేరణ కల్గించాయి. కానీ సమావేశం మధ్యలో నేను దూరంగా వెళ్లిపోయా. (‘ఆ ఇద్దరే సిరీస్ స్వరూపాన్ని మార్చేశారు’) నేను ఏదో చేయాలనిపించింది. సాధ్యమైనంత ఎక్కువ స్కోరు సాధించాలి అనుకున్నా. అందుకోసం పోరాటం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నా. కానీ ఆంబ్రోస్ వంటి బౌలర్‌ను ఆడటంపై గురి పెట్టా. ఆంబ్రోస్ ఒక గొప్ప బౌలర్. అతని గురించి చెప్పడానికి మాటలు చాలవు. అసాధారణ బౌలర్. ఒక గొప్ప ప్రత్యర్థి. అతని నుంచి బంతులు దారుణంగా ఉంటాయి. స్లెడ్జింగ్ కంటే అతని బంతులే ప్రమాదం. అతను ఏమి ఆలోచిస్తున్నాడో మనకు తెలీదు. నన్ను ఔట్ చేసేందుకు బంతులు వేస్తున్నాడా.. లేక గాయపరిచేందుకు వేస్తున్నాడా అనేది తెలీదు. వర్ణించడానికి వీలుకాని ప్రత్యర్థి ఆంబ్రోస్. ఇక నా ఇన్నింగ్స్ విషయానికొస్తే వెస్టిండీస్‌తో ఆ ఇన్నింగ్స్ నన్ను ప్లేయర్‌గా నిలబెట్టింది. ఆది బాబ్ సింప్సన్ క్రెడిట్. కానీ అది అతనికి దక్కదని తెలుసు. మమ్మల్ని కూర్చోబెట్టి మీలో ఒకరు భారీ సెంచరీ చేయాలి అని చెప్పిన మాటలు నన్ను ఆలోచింప చేశాయి. అదే లక్ష్యంతో బరిలోకి దిగి డబుల్ సెంచరీ చేశా’ అని స్కై స్పోర్ట్స్ యూట్యూబ్ వీడియో ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ అథర్టన్‌తో విండీస్‌తో విషయాలను స్టీవ్ వా షేర్ చేసుకున్నాడు. మూడో టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులు చేయగా, విండీస్ 265 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. దాంతో మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా ఆసీస్ 2-1తో గెలుచుకుంది. (233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) -
‘క్రిస్ గేల్.. ఇదేం పద్ధతి’
మాంచెస్టర్: క్రిస్ గేల్.. ఒక స్టార్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తన రిటైర్మెంట్ నిర్ణయంపై ఇప్పటికీ సందిగ్థంలో ఉన్నాడు ఈ కరీబియన్క్రికెటర్. కాసేపు ఈ వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతానంటాడు.. అంతలోనే లేదు.. లేదు ఇంకా కొనసాగుతా అంటూ మాట మార్చడం గేల్‌కు పరిపాటిగా మారిపోయింది. ఇటీవల టెస్టు క్రికెట్ ఆడాలని ఉంది అంటూ గేల్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. ‘స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కచ్చితంగా ఆడతా. అలాగే వన్డే సిరీస్ కూడా. కానీ టీ20ల్లో ఆడను. ఇదే ప్రపంచకప్ తర్వాత నా ప్రణాళిక’ అంటూ వ్యాఖ్యానించాడు. దాదాపు ఐదేళ్ల క్రితం టెస్టు మ్యాచ్ ఆడిన గేల్.. మళ్లీ టెస్టు ఫార్మాట్‌కు సిద్ధం అంటూ ప్రకటించడంపై ఆ దేశ దిగ్గజ పేసర్ కర్ట్లీ ఆంబ్రోస్ మండిపడ్డాడు. ‘గేల్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడతానంటూ సంకేతాలు ఇవ్వడం బాలేదు. అసలు నీ నిర్ణయాలతో యువ క్రికెటర్లకు తప్పుడు భావన కలుగుతుంది. నువ్వు వన్డేల్లో కానీ, టీ20లో కానీ కొనసాగితే ఇబ్బంది లేదు. టెస్టు క్రికెట్ అంటూ కొత్త పల్లవి అందుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి. ఐదేళ్ల నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. అది కచ్చితంగా వెనుకడుగే. నువ్వు పరిమిత ఓవర్ల క్రికెట్లో విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నావ్. నీ బ్యాటింగ్ శైలికి టెస్టు మ్యాచ్‌లు సరిపోదు. నీ మైండ్ సెట్ పదే పదే మార్చుకోవడం సరైనది కాదు’ అంటూ ఆంబ్రోస్ విమర్శించాడు. -
కర్ట్లీ ఆంబ్రోస్ డ్యాన్స్ వీడియో వైరల్
సిడ్నీ: కర్ట్లీ ఆంబ్రోస్.. పాత తరం క్రికెట్ అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితం. పేస్ బౌలింగ్‌లో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించిన ఈ దిగ్గజ బౌలర్.. తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ డ్యాన్స్ షోలో 55 ఏళ్ల ఆంబ్రోస్ చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన డ్యాన్స్ భాగస్వామితో కలిసి ప్రఖ్యాత గాయకుడు 'ఎడ్ షీరాన్' ఫేమస్ ట్రాక్ 'పర్ఫెక్ట్'కు ఆంబ్రోస్ వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించాయి. ఆంబ్రోస్ డ్యాన్స్ చేసిన వీడియోని వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ‘మాకు కూడా కొన్ని స్టెప్పులు మిగల్చండి సార్’ అని కామెంట్ విండీస్ బోర్డు..’ మీరు ఆంబ్రోస్ ఓట్ చేయండి’ అని ట్వీట్ చేసింది. ఏదో విభిన్నంగా చేయాలన్న ఆలోచనతోనే రియాల్టీ షోలో పాల్గొన్నట్టు ఆంబ్రోస్ చెప్పాడు. ఈ వీడియోని చూసిన ఓ నెటజన్ ‘ఇదే వేగంతో క్రికెట్ ఆడేప్పుడు పాదాలు కదిలించి ఉంటే అతడి పేరు మీద మరిన్ని పరుగులు నమోదయ్యేవి’ అని సరదాగా ట్వీట్ చేశాడు. So beautiful! @ambrose_curtly #DWTSau pic.twitter.com/fOjcweQ2QU — Dancing With The Stars Australia (@DancingOn10) 18 February 2019 -
'బంగ్లాదేశ్‌లో ఆంబ్రోస్ కోసం వెతుకుతున్నా'
ఢాకా: కర్టిలీ ఆంబ్రోస్.. 1990వ దశకంలో వెస్టిండీస్‌కు వెన్నుముక. అప్పట్లో అరవీర భయంకరుడిగా పేరు తెచ్చుకున్నఆంబ్రోస్.. అటు ఫాస్ట్ బంతులను సంధించడంలోనూ, ఇటు దిమ్మతిరిగే బౌన్సర్లు వేయడంలోనూ అందివేసిన చేయి. అయితే మరో ఆంబ్రోస్‌ను తయారు చేయాలనేది తన సహచర బౌలర్ కోట్నీ వాల్ష్ కోరికట. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఎంపికైన వాల్ష్.. ఇప్పుడు అక్కడ ఆంబ్రోస్‌ను వెతికే పనిలో పడ్డాడు. కనీసం ఇద్దరు ఆంబ్రోస్లను బంగ్లాకు అందిస్తే తన కోరిక నెరవేరినట్లేనని వాల్ష్ అంటున్నాడు. 'నేను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక అవుతానని అనుకోలేదు. ఒక కోచ్‌గా, సలహాదారుడిగా బంగ్లాను ముందుండి నడిపించడానికి సర్వశక్తులా ఒడ్డుతా. నాకు హై ప్రొఫైల్ జాబ్‌ను అప్పగించిన బంగ్లాదేశ్ క్రికెట్‌కు కృతజ్ఞతలు. నేను అంతర్జాతీయ క్రికెట్‌ను వీడిన తరువాత నుంచి ఇప్పటివరకూ ఏదో రూపంలో ఆ క్రీడనే అంటిపెట్టుకుని ఉన్నా. ప్రపంచ క్రికెట్ కు ఫాస్ట్ బౌలర్లను అందించడానికి నావంతు ప్రయత్నం చేస్తునే ఉన్నా. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఆంబ్రోస్ లాంటి బౌలర్‌ను చూడాలనేది నా ప్రధానమైన కోరిక. అందుకోసం అన్వేషించడమే నా పని. కనీసం ఇద్దరు ఆంబ్రోస్ లాంటి బౌలర్లను బంగ్లాదేశ్ కు అందిస్తే, చాలా సంతోషం'అని ఆదివారం బాధ్యతలు స్వీకరించిన వాల్ష్ పేర్కొన్నాడు.