జమైకా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై విండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను టెస్టుల్లో కచ్చితంగా 400 వికెట్ల మార్క్‌ను అందుకుంటాడని ఆంబ్రోస్ జోస్యం చెప్పాడు. ఇటీవలే కర్ట్‌లీ అండ్ కరీష్మా షోలో పాల్గొన్న ఆంబ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
బుమ్రా బౌలింగ్‌కు నేను పెద్ద అభిమానిని. అతని బౌలింగ్ శైలి నాకు కొత్తగా అనిపించింది. బంతిని స్వింగ్ చేస్తూనే డెత్ ఓవర్లలో యార్క్‌ర్లు సంధిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తిస్తాడు. అతని నైపుణ్యానికి తోడూ అమ్ములపొదిలో ఇంకా చాలా అస్త్రాలు దాగున్నాయి. అవసరం ఉంటేనే అవి బయటికి తీస్తాడు. ఈ మధ్య వరుసగా గాయాలపాలవుతూ బుమ్రా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజమే.. కానీ అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తే మాత్రం ఆపడం ఎవరి తరం కాదు. బుమ్రా క్రికెట్ ఆడినంత కాలం ఆరోగ్యంగా ఉంటూ.. ఫిట్‌నెస్ కాపాడుకుంటే మాత్రం టెస్టుల్లో కచ్చితంగా 400 వికెట్ల మార్క్‌ను అందుకుంటాడు. అని చెప్పుకొచ్చాడు.
ఇక బుమ్రా ఇటీవలే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు మాత్రమే ఆడి నాలుగు వికెట్లు తీశాడు. పెళ్లి కారణాల రిత్యా సిరీస్ మధ్యలోనే వెళ్లిపోయిన బుమ్రా ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ 14వ సీజన్‌లో బరిలోకి దిగాడు. ఏడు మ్యాచ్‌లాడిన బుమ్రా ఆరు వికెట్లు తీశాడు. ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు బుమ్రా ఎంపికయ్యాడు. ఇక బుమ్రా టెస్టుల్లో ఇప్పటివరకు 19 టెస్టులాడి 83 వికెట్లు తీశాడు. ఇక సర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ 1980,90వ దశకంలో తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. విండీస్ తరపున 98 టెస్టుల్లో 405 వికెట్లు.. 176 వన్డేల్లో 225 వికెట్లు తీశాడు.
చదవండి: ఐపీఎల్ వాయిదా: ఆనందంలో సంజన గణేషన్!
రాయుడు అరుదైన రికార్డు.. బుమ్రా చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment