మాంచెస్టర్: క్రిస్ గేల్.. ఒక స్టార్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తన రిటైర్మెంట్ నిర్ణయంపై ఇప్పటికీ సందిగ్థంలో ఉన్నాడు ఈ కరీబియన్‌క్రికెటర్. కాసేపు ఈ వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతానంటాడు.. అంతలోనే లేదు.. లేదు ఇంకా కొనసాగుతా అంటూ మాట మార్చడం గేల్‌కు పరిపాటిగా మారిపోయింది. ఇటీవల టెస్టు క్రికెట్ ఆడాలని ఉంది అంటూ గేల్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. ‘స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కచ్చితంగా ఆడతా. అలాగే వన్డే సిరీస్ కూడా. కానీ టీ20ల్లో ఆడను. ఇదే ప్రపంచకప్ తర్వాత నా ప్రణాళిక’ అంటూ వ్యాఖ్యానించాడు.
దాదాపు ఐదేళ్ల క్రితం టెస్టు మ్యాచ్ ఆడిన గేల్.. మళ్లీ టెస్టు ఫార్మాట్‌కు సిద్ధం అంటూ ప్రకటించడంపై ఆ దేశ దిగ్గజ పేసర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ మండిపడ్డాడు. ‘గేల్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడతానంటూ సంకేతాలు ఇవ్వడం బాలేదు. అసలు నీ నిర్ణయాలతో యువ క్రికెటర్లకు తప్పుడు భావన కలుగుతుంది. నువ్వు వన్డేల్లో కానీ, టీ20లో కానీ కొనసాగితే ఇబ్బంది లేదు. టెస్టు క్రికెట్ అంటూ కొత్త పల్లవి అందుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి. ఐదేళ్ల నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. అది కచ్చితంగా వెనుకడుగే. నువ్వు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నావ్. నీ బ్యాటింగ్ శైలికి టెస్టు మ్యాచ్‌లు సరిపోదు. నీ మైండ్ సెట్ పదే పదే మార్చుకోవడం సరైనది కాదు’ అంటూ ఆంబ్రోస్ విమర్శించాడు.
Comments
Please login to add a commentAdd a comment