లీడ్స్: వరల్డ్‌కప్ పరంగా చూస్తే క్రిస్ గేల్ ఇదే చివరిది. దానిలో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో గేల్ తన చివరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడేశాడు. తన చివరి మెగా టోర్నీలో గేల్ విఫలమయ్యాడనే చెప్పాలి. అఫ్గానిస్తాన్‌తో తన ఆఖరి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడిన గేల్ 7 పరుగులే చేసి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తొలుత వరల్డ్‌కప్ తర్వాత తన రిటైర్మెంట్ ఉంటుందని ప్రకటించిన గేల్.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. భారత్‌తో సిరీస్ ఆడిన తర్వాతే తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానంటూ స్పష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో గేల్ వీడ్కోలు అంశానికి సంబంధించి సహచర ఆటగాడు షాయ్ హోప్ మాట్లాడుతూ.. క్రికెట్‌కు గేల్ వీడ్కోలు చెప్పిన రోజును ఒక దుర్దినంగా అభివర్ణించాడు. ‘ గేల్ రిటైర్మెంట్ ప్రకటించిన క్షణం క్రికెట్‌లో ఒక దుర్దినంగా మిగిలి పోతుంది. యావత్ ప్రపంచం నిన్ను కచ్చితంగా మిస్పవుతుంది’ అని పేర్కొన్నాడు.అసలు గేల్ నుంచి దేన్ని ప్రధానంగా కోల్పోతారని హోప్‌ను ప్రశ్నించగా.. ‘అతను పెట్టుకునే వింత వింత సన్ గ్లాసెస్‌ను మిస్సవుతాం’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. అదే సమయంలో గేల్ ఒక అసాధారణ ఆటగాడని, అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామన్నాడు హోప్. వచ్చే నెల్లో భారత్‌తో సిరీస్ ఆడిన తర్వాత తన రిటైర్మెంట్ ఉంటుందని గేల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వదేశంలో భారత్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌లో కూడా ఆడతానని గేల్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment