లీడ్స్: ప్రపంచకప్‌లో తమ జట్టు కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించిందని వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ అన్నాడు. విండీస్ తరఫున రికార్డు స్థాయిలో ఐదు ప్రపంచకప్‌లు ఆడిన గేల్‌కు ఈ ప్రతిష్టాత్మక టోర్నీయే చివరిది. ఇందులో తొలి మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్.. ఆ తర్వాత వరుసగా ఏడింట్లో ఓడి సెమీస్‌కు దూరమైంది. గురువారం ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో మాత్రం 23 పరుగులతో గెలిచి విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ విండీస్‌కే కాదు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్‌కు కూడా ఆఖరిదే. ఇందులో బ్యాట్‌తో విఫలమైన గేల్(7).. బౌలింగ్‌లో మాత్రం 6 ఓవర్లు వేసి 28 పరుగులకు 1 వికెట్ తీశాడు.
దీనిపై మ్యాచ్ అనంతరం గేల్ మీడియాతో మాట్లాడాడు. ‘ప్రపంచకప్‌లో ఐదుసార్లు వెస్టిండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అయితే, ప్రస్తుత టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకపోవడం నిరాశ కలిగించింది’అని పేర్కొన్నాడు. ‘రెండేళ్ల విశ్రాంతి అనంతరం విండీస్ జట్టులోకి తిరిగి పునరాగమనం చేశా. ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తుకొని మురిసిపోవాలనుకున్నా. అయితే, అది సాధ్యం కాలేదు. ఈ టోర్నీ ద్వారా విండీస్‌కు హెట్‌మైర్, పూరన్, హోప్ వంటి ప్రతిభావంతులు దొరికారు. వీరికి యువ సారథి హోల్డర్ తోడయ్యాడు. కచ్చితంగా విండీస్ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. స్వదేశంలో భారత్‌తో సిరీస్ తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీడ్, కెనడా టీ20 సిరీస్‌ల్లో ఆడాలనుకుంటున్నా’అని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment