జమైకా: వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌కు అదనపు బాధ్యతను అప్పజెప్పింది ఆ దేశ క్రికెట్ బోర్డు. రాబోవు వరల్డ్‌కప్‌లో గేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు గత కొన్ని నెలల క్రితం గేల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో గేల్ చెలరేగి ఆడాడు. రెండు భారీ సెంచరీలతో పాటు పలు హాఫ్ సెంచరీలు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నమోదు చేశాడు.
దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫుల్‌ఫామ్‌లో ఉన్న గేల్‌ను వరల్డ్‌కప్ వెళ్లే విండీస్ జట్టుకు వైస్ కెప్టెన్ నియమించడమే సరైన నిర్ణయంగా భావించిన సదరు క్రికెట్ బోర్డు ఆ మేరకు చర్యలు చేపట్టింది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు డిప్యూటీగా గేల్‌ను నియమించింది. దీనిపై గేల్ మాట్లాడుతూ.. ‘ నేను ఎప్పుడూ వెస్టిండీస్ జట్టుకు ఆడటాన్ని గౌరవంగా భావిస్తా. ఈ వరల్డ్‌కప్ నాకు చాలా స్పెషల్. ఒక సీనియర్ ఆటగాడిగా కెప్టెన్‌కు సహాయం పడటం నా బాధ్యత. ఇది కచ్చితంగా నాకు అతి పెద్ద వరల్డ్‌కప్ అని అనుకుంటున్నా. నాపై చాలా అంచనాలు ఉన్నాయి. అందుకోసం నా శాయశక్తులా కృషి చేస్తా. విండీస్ ప్రజల్ని అలరిస్తాననే అనుకుంటున్నా’ అని గేల్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment