నాటింగ్‌హామ్: ఔట్ కాదని సాధారణ ప్రేక్షకుడూ చెప్పగలిగే బంతులకూ ఔటివ్వడం ద్వారా ఆసీస్–వెస్టిండీస్ మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయాలు పలుసార్లు ప్రశ్నార్ధకంగా నిలిచాయి. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో రెండు వరుస బంతుల్లో గేల్‌ను అంపైర్ క్రిస్ గఫానీ (న్యూజిలాండ్) ఎల్బీగా ప్రకటించాడు. ఈ నిర్ణయాలు తప్పని భావించాడో ఏమో గేల్ తడుముకోకుండా వెంటనే రివ్యూలు కోరి బయటపడ్డాడు.
గేల్ ఔటైన బంతి కంటే ముందు స్టార్క్ వేసిన బంతి నోబాల్ అయినప్పటికీ అంపైర్ గుర్తించలేదు. లేదంటే గేల్ ఔటైన బంతి ఫ్రీ హిట్ అయ్యేది. మ్యాక్స్‌వెల్ వేసిన 30వ ఓవర్ ఐదో బంతికి, జంపా వేసిన 36వ ఓవర్ మూడో బంతికి హోల్డర్‌కూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అంపైర్ రుచిర పల్లియగురుగె (శ్రీలంక) నిర్ణయాలపై రివ్యూకు వెళ్లి హోల్డర్ వికెట్ కాపాడుకున్నాడు. ఇలా వరుసగా నాలుగు రివ్యూలూ విజయవంతమైన సందర్భాలు అరుదని; ఒకవేళ ‘ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డీఆర్‌ఎస్‌కు ఇవ్వాలి’ అంటూ జోకులు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment