విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ సరిగ్గా రాణించకపోవటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ లీగ్స్‌లో(ఐపీఎల్, బీపీఎల్) అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. స్వదేశీ జట్టు తరపున మాత్రం పేలవమైన ప్రదర్శన ఇస్తున్నాడు. తాజాగా బీపీఎల్ ఫైనల్‌లో 146 పరుగులు చేసిన ఈ జెయింట్ బ్యాట్స్‌మన్.. న్యూజిలాండ్ సిరీస్‌లో ఘోరంగా విఫలం కావటంతో అవి మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మొత్తం 4 మ్యాచుల్లో 38 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో ఇక అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైం వచ్చిందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో జట్టు కోచ్ సువర్ట్ లా గేల్‌కు అండగా నిలుస్తున్నాడు. ‘‘ప్రస్తుతం అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అందుకే కివీస్ తో సిరీస్‌లో బంతులు ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బందులపాలయ్యాడు. ఇంతకు ముందు ఇంగ్లాండ్ సిరీస్‌లో అతను రాణించిన విషయాన్ని విమర్శకులు మరిచిపోయారేమో! విమర్శలను గేల్ కూడా పట్టించుకోవటమే మంచింది. ప్రత్యర్థులపై విరుచుకుపడే సత్తా అతనికి మరికొంత కాలం ఉంది’’ అని లా పేర్కొన్నారు.
న్యూజిలాండ్ సిరీస్ ఓటమి ఒక్క గేల్ మూలంగా కాదని.. మొత్తం జట్టు వైఫల్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ విషయంలో బోర్డు, అతన్ని తొలగించాలని పట్టుబడుతున్న కొందరు జట్టు సభ్యులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని లా సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment