ఫన్నీ బౌలింగ్‌.. మిచెల్‌ మార్ష్‌ ఔట్‌తో ముగించాడు | Chris Gayle Signs Off T20 World Cup 2021 With Mitchell Marsh Wicket | Sakshi
Sakshi News home page

Chris Gayle: ఫన్నీ బౌలింగ్‌.. మిచెల్‌ మార్ష్‌ ఔట్‌తో ముగించాడు

Published Sat, Nov 6 2021 7:42 PM | Last Updated on Sat, Nov 6 2021 7:49 PM

Chris Gayle Signs Off T20 World Cup 2021 With Mitchell Marsh Wicket - Sakshi

Chris Gayle Signs Off T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో  ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఆద్యంతం నవ్వులు పంచింది. దీనికి కారణం క్రిస్‌ గేల్‌. అతని రిటైర్మెంట్‌పై క్లారిటీ లేనప్పటికీ టి20 ప్రపంచకప్‌లో విండీస్‌ తరపున గేల్‌ ఆఖరి మ్యాచ్‌ ఆడేసినట్లే. అందుకు తగ్గట్లే గేల్‌ హావభావాలు ఉండడం విశేషం. ముందు బ్యాటింగ్‌కు సన్‌గ్లాసెస్‌ పెట్టుకొని రావడం.. ఆ తర్వాత ఔటై వెళ్తూ తన బ్యాట్‌ను పైకెత్తి ఫ్యాన్స్‌కు అభివాదం చేయడం కనిపించింది.

చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్‌ కొట్టిన రసెల్‌.. వీడియో వైరల్‌

ఇక బౌలింగ్‌లోనూ గేల్‌ తన వైవిధ్యతను చూపించాడు. ఆసీస్‌ విజయానికి దగ్గరైన వేళ విండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ను గేల్‌ చేత వేయించాడు. కనీసం క్యాప్‌ తీయకుండా గేల్‌ బౌలింగ్‌ చేయడం విశేషం. ఓవర్‌ ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఆసీస్‌ బ్యాటర్స్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లు కూడా ఫన్నీవేలో బ్యాటింగ్‌ కొనసాగించారు. ఇన్నింగ్స్‌ మూడో బంతికి వార్నర్‌ను అవుట్‌ చేసినంత పని చేశాడు. అయితే పూరన్‌ స్టంపింగ్‌ మిస్‌ చేయడంతో గేల్‌ వార్నర్‌ దగ్గరకు చెవిలో ఏదో చెప్పి వెళ్లిపోయాడు. ఇక ఓవర్‌ ఆఖరి బంతికి గేల్‌ మిచెల్‌ మార్ష్‌ను ఔట్‌ చేసి వికెట్‌ను ఖాతాలో వేసుకొని టి20 కెరీర్‌ను ముగించాడు. ప్రస్తుతం గేల్‌ చేష్టలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గేల్‌ అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించడమే తరువాయి. 

చదవండి: T20 WC 2021 AUS Vs WI: చెలరేగిన వార్నర్‌, మార్ష్‌.. విండీస్‌పై ఆసీస్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement