T20 World Cup 2021: Sri Lanka Beat West Indies By 20 Runs, WI Out Of Tourney - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Wi Vs SL: వాళ్లిద్దరు మినహా.. డిఫెండింగ్‌ చాంపియన్‌.. 1,8,9, 2,0,8,2,1.. టోర్నీ నుంచి అవుట్‌

Published Fri, Nov 5 2021 7:49 AM | Last Updated on Fri, Nov 5 2021 9:47 AM

T20 World Cup 2021: Sri Lanka Beat West Indies By 20 Runs WI Out Of Tourney - Sakshi

Sri Lanka Beat West Indies By 20 Runs WI Out Of Tourney: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అబుదాబి వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయి ఈవెంట్‌ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పొలార్డ్‌ బృందం.. లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి శ్రీలంక 189 పరుగులు చేసింది. ఆండ్రీ రసెల్‌కు రెండు, బ్రావోకు ఒక వికెట్‌ దక్కాయి.

ఇక లక్ష్య ఛేదనలో భాగంగా విండీస్‌కు ఓపెనర్లు క్రిస్‌ గేల్‌(1), ఎవిన్‌ లూయీస్‌(8) దారుణంగా విఫలమయ్యారు. నికోలస్‌ పూరన్‌(46) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా... షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(81) ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే అర్ధ సెంచరీతో మెరిసి అజేయంగా నిలిచినా... జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 

రసెల్‌(2), పొలార్డ్‌(0), జేసన్‌ హోల్డర్‌(8), డ్వేన్‌ బ్రావో(2), అకేల్‌ హొసేన్‌(1) కనీసం పది పరుగులు కూడా చేయలేక చకచకా పెవిలియన్‌ చేరడంతో రెండుసార్లు పొట్టిఫార్మాట్‌ ప్రపంచకప్‌ విజేత అయిన విండీస్‌కు ఓటమి తప్పలేదు. బినుర ఫెర్నాండో రెండు వికెట్లు, దుష్మంత చమీర ఒకటి, చమిక కరుణరత్నే రెండు, కెప్టెన్‌ దసున్‌ షనక ఒకటి, వనిందు హసరంగ రెండు వికెట్లు తీసి వెస్టిండీస్‌ పతనాన్ని శాసించారు. 

ఫలితంగా యువ ఆటగాళ్లతో కూడిన శ్రీలంక జట్టు చేతిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ 20 పరుగుల తేడాతో ఓటమిపాలై నాకౌట్‌ దశలోనే చేతులెత్తేసింది. ఇక ఇప్పటికే 5 మ్యాచ్‌లలో మూడింటిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక.. విండీస్‌కు కూడా తమలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది. చరిత్‌ అసలంక(41 బంతుల్లో 68 పరుగులు, 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కోర్లు:
శ్రీలంక- 189/3 (20)
వెస్టిండీస్‌- 169/8 (20)

చదవండి: AUS VS BAN: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా
T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్‌ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గనిస్తాన్‌ సరసన
T20 WC 2021: సెమీస్‌ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement