WI Vs SL 1st Test 2021: Srilanka Won By 187 Runs Against West Indies - Sakshi
Sakshi News home page

WI vs SL 1st Test: లంక స్పిన్నర్ల ప్రతాపం.. తొలి టెస్టులో వెస్టిండీస్‌ ఘోర పరాజయం

Published Thu, Nov 25 2021 2:52 PM | Last Updated on Thu, Nov 25 2021 4:44 PM

Sri Lanka Won By 187 Runs Against West Indies 1st Test - Sakshi

Sri Lanka Won By 187 Runs Vs West Indies 1st Test.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన వెస్టిండీస్‌ 160 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బ్యాటర్స్‌లో క్రుమ్హా బానర్‌ 68 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జోషువా డిసిల్వా 54 పరుగులు చేయగా.. మిగిలిన 8 మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.లంక బౌలర్లలో రమేశ్‌ మెండిస్‌ 5 వికెట్లతో సత్తా చాటగా.. లసిత్‌ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీశాడు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులతో మెరిసిన కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నేకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ విజయంతో శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు నవంబర్‌ 29 నుంచి జరగనుంది.

శ్రీలంక: తొలి ఇన్నింగ్స్‌ 308 ఆలౌట్‌
           రెండో ఇన్నింగ్స్‌ 191/4
వెస్టిండీస్‌: తొలి ఇన్నింగ్స్‌ 230 ఆలౌట్‌
            రెండో ఇన్నింగ్స్‌ 160 ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement