స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక పట్టు సాధించే దిశగా ముందుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
రాణించిన కరుణరత్నే, చండీమల్
కరుణరత్నే (83), చండీమల్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడింది. పథుమ్ నిస్సంక (2) ఆదిలోనే ఔటైనా వీరిద్దరు రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్ (34), ధనంజయ డిసిల్వ (34) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్ తక్కువ స్కోర్‌కే (13) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టిన విలియమ్ ఓరూర్కీ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. అజాజ్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.
లీడ్ సాధించిన న్యూజిలాండ్
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.
కమిందు సెంచరీ.. ఐదేసిన రూర్కీ
కమిందు మెండిస్ సెంచరీతో (114) కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేయగలిగింది. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. నిస్సంక (27), చండీమల్ (30), మాథ్యూస్‌లకు (36) మంచి స్టార్ట్ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు.
కెరీర్‌లో రెండో టెస్ట్ ఆడుతున్న రూర్కీ ఐదు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment