న్యూజిలాండ్‌పై రెండో టెస్ట్‌లో విజయానంతరం శ్రీలంక జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25)లో శ్రీలంక తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేసి నాలుగింట ఓడింది. న్యూజిలాండ్‌పై తాజా విక్టరీతో శ్రీలంక పాయింట్ల పర్సంటేజీ 55.56 శాతంగా ఉంది.
మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్ మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఎనిమది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, ఐదింట పరాజయాలు ఎదుర్కొంది. ఆ జట్టు పాయింట్ల పర్సంటేజీ 37.50 శాతంగా ఉంది.
టాప్‌లోనే భారత్
స్వదేశంలో బంగ్లాదేశ్‌ను తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సొంతం చేసుకుని, 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ పాయింట్ల పర్సంటేజీ 71.67 శాతంగా ఉంది.
బంగ్లాదేశ్ విషయానికొస్తే.. భారత్ చేతిలో తొలి టెస్ట్‌లో ఓటమి అనంతరం ఈ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, నాలుగింట ఓడింది.
భారత్ వెనకాలే ఆస్ట్రేలియా
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా భారత్ వెనకాలే ఉంది. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సైకిల్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి, ఏడింట ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
మిగతా జట్ల విషయానికొస్తే..
తాజా స్టాండింగ్స్‌లో సౌతాఫ్రికా ఆరో స్థానంలో.. పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (3 పరాజయాలు, ఓ డ్రా), పాకిస్తాన్ ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (5 పరాజయాలు), వెస్టిండీస్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం (6 పరాజయాలు, 2 డ్రాలు) సాధించాయి.
చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..
Comments
Please login to add a commentAdd a comment