శ్రీలంక, న్యూజిలాండ్‌ మూడో వన్డే రద్దు | New Zealand, Sri Lanka Third ODI Has Been Called Off Due To Rain | Sakshi
Sakshi News home page

శ్రీలంక, న్యూజిలాండ్‌ మూడో వన్డే రద్దు

Published Tue, Nov 19 2024 8:13 PM | Last Updated on Tue, Nov 19 2024 8:19 PM

New Zealand, Sri Lanka Third ODI Has Been Called Off Due To Rain

పల్లెకెలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్‌ మధ్య ఇవాళ (నవంబర్‌ 19) జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 21 ఓవర్ల పాటు మ్యాచ్‌ సజావుగా సాగింది. ఆతర్వాత వర్షం​ ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 112 పరుగులు చేసింది. టిమ్‌ రాబిన్సన్‌ 9 పరుగులు చేసి ఔట్‌ కాగా.. విల్‌ యంగ్‌ 56, హెన్రీ నికోల్స 46 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో మొహమ్మద్‌ షిరాజ్‌కు ఓ వికెట్‌ దక్కింది.

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో డ్రా అయ్యింది. రెండు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోస​ం న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకలో పర్యటించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement