వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! | Joshua Da Silva Takes Revenge Agianst Dhananjaya De Silva Taking Catch | Sakshi
Sakshi News home page

Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా!

Published Wed, Dec 1 2021 7:16 PM | Last Updated on Wed, Dec 1 2021 7:33 PM

Joshua Da Silva Takes Revenge Agianst Dhananjaya De Silva Taking Catch - Sakshi

Joshua da Silva Vs Dhananjaya de Silva.. క్రికెట్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటలయుద్ధం జరగడం సహజం. వెస్టిండీస్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇక ఆటగాళ్లు ప్రతీకారం ఈ విధంగా కూడా తీసుకుంటారా అని అనిపించడం ఖాయం. వారిద్దరే ధనుంజయ్‌ డిసిల్వా.. జోషువా ద సిల్వా. ధనుంజయ్‌ డిసిల్వా శ్రీలంక ఆల్‌రౌండర్‌ కాగా... జోషువా ద సిల్వా వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌. ఇక విషయంలోకి వెళితే.. లంక, విండీస్‌ మధ్య జరిగిన తొలి టెస్టులో విండీస్‌ కీపర్‌ ద సిల్వా..  లసిత్‌ ఎంబుల్దేనియా బౌలింగ్‌లో ధనుంజయ్‌ డిసిల్వాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన జోషువా.. కీలక సమయంలో రాణించినప్పటికి జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా

తాజాగా రెండో టెస్టులో ఈసారి 2 పరుగులు చేసిన ధనుంజయ్‌ డిసిల్వా.. వీరాస్వామి పెరుమాల్‌ బౌలింగ్‌లో జోషువా ద సిల్వాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్‌కు వెళ్తున్న ధనుంజయ్‌ను ఉద్దేశించి జోషువా ..''నువ్వు నా క్యాచ్‌ పట్టావు.. నేను నీ క్యాచ్‌ పట్టా.. క్రికెట్‌లో జరిగేది ఇదే'' అనడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పాతుమ్‌ నిస్సాంక 21, చరిత్‌ అసలంక 4 పరుగులతో ఆడుతున్నారు.  అంతకముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్‌ అయింది. రమేశ్‌ మెండిస్‌ 6 వికెట్లు తీయగా.. ఎంబుల్డేనియా 2, జయవిక్రమ 2 వికెట్లు తీశారు.

చదవండి: ICC Test Rankings: టాప్‌-5లోకి దూసుకొచ్చిన షాహిన్‌.. దిగజారిన విలియమ్సన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement