అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ సరికొత్త రికార్డుపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘‘సిక్స్ సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం.. యూ బ్యూటీ’’అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా స్వదేశంలో శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20లో పొలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. లంక ఆటగాడు అకిల ధనుంజయ బౌలింగ్‌లో ఈ రికార్డు సృష్టించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన తొలి విండీస్ క్రికెటర్‌గా, పొట్టి ఫార్మాట్ చరిత్రలో రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఇక ఇంతకు ముందు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో సిక్స్ సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్స్ సిక్సర్ల విశేషాలు
►ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా వెస్టిండీస్ సూపర్‌స్టార్ కీరన్ పొలార్డ్ నిలిచాడు.
►శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత దక్కించుకున్నాడు.
►లంక బౌలర్ అకిల ధనంజయ బౌలింగ్‌లో ఈ రికార్డు సాధించాడు.
►ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ చరిత్రకెక్కాడు.
►ఐసీసీ వరల్డ్ కప్-2007లో భాగంగా గిబ్స్ ఈ ఘనత సాధించాడు.
►నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బంగే బౌలింగ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు.
►టీ20 చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించాడు.
►టీ20 ప్రపంచకప్-2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు.
►స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి యువీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
చదవండి: పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్
Take a bow Skipper!🔥 🔥 🔥 🔥 🔥 🔥 The 1st West Indian to hit 6️⃣ sixes in an over in a T20I!🤯 #WIvSL #MenInMaroon
— Windies Cricket (@windiescricket) March 4, 2021
Live Scorecard⬇️ https://t.co/MBDOV534qQ pic.twitter.com/etkxX7l7bq
Comments
Please login to add a commentAdd a comment