Cricketers Who Hits 6 Sixes In An Over- Entire List: అంతర్జాతీయ వన్డేల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ టి20ల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చెలరేగారు. దేశవాళీ వన్డేల్లో ఒక ఆటగాడు ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటాడు. దేశవాళీ టి20ల్లో ముగ్గురు బ్యాటర్లు ఓవర్లో 6 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. వీరంతా ఓవర్లో ఆరేసి సిక్సర్లతో పండగ చేసుకున్నారు.
ఇదంతా ఇప్పటి వరకు రికార్డు... కానీ ఇప్పుడు దీన్ని దాటి ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో కొత్త ఘనత నమోదైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ నోబాల్ సహా 7 బంతుల్లో సిక్సర్లు బాది లిస్ట్–ఎ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే, స్ట్‌క్లాస్ క్రికెట్‌లో (టెస్టులు, మూడు, నాలుగు రోజుల మ్యాచ్‌లు) మాత్రం రికార్డు లీ జెర్మన్ (8 సిక్స్‌లు) పేరిట ఉంది.
లీ జెర్మన్ కొట్టిన మ్యాచ్‌లో...
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ లీ జెర్మన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టడం అధికారికంగానే నమోదై ఉంది. అయితే ఆ మ్యాచ్ జరిగిన తీరు పూర్తిగా భిన్నమైంది. వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనీ ‘ప్రత్యేక వ్యూహం’లో భాగంగా ఇదంతా జరిగింది. 59 ఓవర్లలో 291 పరుగులు ఛేదించే క్రమంలో కాంటర్‌బరీ 108/8 వద్ద నిలిచింది. అయితే ఆ జట్టును అంత సులువుగా ఓడించరాదని, సులభంగా పరుగులు ఇచ్చి కాస్త ఆడిద్దామని వెల్లింగ్టన్ భావించింది.
ఒకదశలో స్కోరు 196/8కు చేరింది. మరో 2 ఓవర్లు మిగలగా.. అసలు బౌలింగ్ రాని వాన్స్ చేతికి బంతి ఇచ్చారు. అతను ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్ సహా 22 బంతులు వేశాడు. అంటే 5 బంతులే! ఇందులోనే లీ జెర్మన్ 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 77 పరుగులు (0,4,4,4,6,6,4,6,1,4,1,0,6,6,6,6,6,0,0,4,0,1) వచ్చాయి. ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. చివరకు మ్యాచ్ ‘డ్రా’ అయింది.
మరిన్ని రికార్డులు
ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు సమమైంది. 2018లో న్యూజిలాండ్‌లో ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్స్ నమోదు చేసింది. అయితే ఇందులో బ్రెట్ హామ్టన్ 23 పరుగులు, జో కార్టర్ 18 పరుగులు రాబట్టారు.
భారత్ తరఫున రోహిత్ శర్మ (3 సార్లు), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, సమర్థ్ వ్యాస్, కరణ్ కౌశల్ తర్వాత లిస్ట్–ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన పదో భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు.
ఓవర్లో 6 సిక్సర్ల వీరులు
అంతర్జాతీయ వన్డేలు
►హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)- బౌలర్: డాన్ వాన్ బంగ్ (నెదర్లాండ్స్; 2007లో)
►జస్కరన్ మల్హోత్రా (అమెరికా)- బౌలర్: గౌడీ టోకా (పాపువా న్యూగినియా; 2021లో)
అంతర్జాతీయ టి20లు
►యువరాజ్ (భారత్) బౌలర్- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో)
►కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) బౌలర్- అఖిల ధనంజయ (శ్రీలంక; 2021లో)
ఫస్ట్ క్లాస్ క్రికెట్
►సోబర్స్ (నాటింగమ్‌షైర్ కౌంటీ)- బౌలర్: నాష్ (గ్లామోర్గాన్; 1968లో)
►రవిశాస్త్రి (ముంబై)- బౌలర్: తిలక్ రాజ్ (బరోడా; 1984లో)
►లీ జెర్మన్ (కాంటర్ బరీ)- బౌలర్: వాన్స్ (వెల్లింగ్టన్; 1990లో)
దేశవాళీ వన్డేలు
►తిసారా పెరీరా (శ్రీలంక; శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్)- బౌలర్: దిల్హాన్ కూరే (బ్లూమ్‌ఫీల్డ్; 2021లో)
►రుతురాజ్ గైక్వాడ్ (భారత్; మహారాష్ట్ర)- బౌలర్: శివ సింగ్ (ఉత్తరప్రదేశ్; 2022లో)
దేశవాళీ టి20లు
►రోజ్ వైట్లీ (వొర్స్‌టర్‌షైర్) - బౌలర్: కార్ల్ కార్వర్ (యార్క్‌షైర్; 2017లో)
►లియో కార్టర్ (కాంటర్‌బరీ) - బౌలర్: ఆంటన్ డెవ్‌సిచ్ (నార్తర్న్ డిస్ట్రిక్ట్స్; 2020లో)
►హజ్రతుల్లా జజాయ్ (కాబూల్ జ్వానన్)- బౌలర్: అబ్దుల్లా మజారి (బాల్క్ లెజెండ్స్; 2018లో)
చదవండి: Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు!
Indian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు!
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
Comments
Please login to add a commentAdd a comment