చెలరేగిన చండీమాల్‌.. 225 పరుగుల లక్ష్యం హాం ఫట్‌ | LPL 2024: Kandy Falcons Beat Jaffna Kings By 7 Wickets | Sakshi
Sakshi News home page

చెలరేగిన చండీమాల్‌.. 225 పరుగుల లక్ష్యం హాం ఫట్‌

Published Tue, Jul 9 2024 6:40 PM | Last Updated on Wed, Jul 10 2024 5:16 PM

LPL 2024: Kandy Falcons Beat Jaffna Kings By 7 Wickets

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో ఇవాళ (జులై 9) రసవత్తర సమరం జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్‌ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని క్యాండీ ఫాల్కన్స్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జాఫ్నా కింగ్స్‌.. పథుమ్‌ నిస్సంక శతక్కొట్టండతో (59 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించాడు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్‌ మెండిస్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 225 పరుగుల భారీ లక్ష్య ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ ఆది నుంచే దూకుడుగా ఆడింది. దినేశ్‌ చండీమాల్‌ (37 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కమిందు మెండిస్‌ (36 బంతుల్లో 65 నాటౌట​్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్‌ (13 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్‌ హరీస్‌ (18 బంతుల్లో 25; 5 ఫోర్లు) బ్యాట్‌ను పని చెప్పారు. ఫలితంగా క్యాండీ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement