Sri Lanka Vs Australia Test Series 2022: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగబోయే టెస్టు సిరీస్‌కు శ్రీలంక బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆసీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడే క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన వివరాలు శనివారం వెల్లడించింది. దిముత్ కరుణ కెప్టెన్సీలోని ఈ జట్టులో స్పిన్నర్ జాఫ్రీ వాండర్సేకు చోటు దక్కింది.
వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న అతడు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. జాఫ్రీతో పాటు కుశాల్ మెండిస్, పాథుమ్ నిశాంక, చమిక కరుణ రత్నే, ధనంజయ డి సిల్వ, నిరోషన్ డిక్‌విల్లా తదితర వన్డే ప్లేయర్లు కూడా ఈ జట్టులో ఉన్నారు.
కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా జూన్ 29 నుంచి గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లంక- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంకకు వచ్చింది.
ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో పర్యాటక కంగారూ జట్టు సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టు ఇదే!
దిముత్ కరుణరత్నే(కెప్టెన్), పాథుమ్ నిశాంక, ఒషాడా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనుంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్‌విల్లా(వికెట్ కీపర్), దినేశ్ చండిమాల్(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, ఆసిత ఫెర్నాండో, దిల్షాన్ ముదుషంక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డెనియా, జాఫ్రీ వాండర్సే.
చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు!
Comments
Please login to add a commentAdd a comment