![AUS Beat SL By 9 Wickets, Win Series 2-0](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Australiawon1.jpg.webp?itok=iZTyljtZ)
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్ 2023-25ను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక నిర్ధేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.
శ్రీలంక నిర్ధేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖావాజా(27), మార్నస్ లబుషేన్(26) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు 211/8 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. దీంతో పర్యాటక ఆసీస్ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే శ్రీలంక ఉంచగల్గింది.
కాగా లంక బ్యాటర్లలలో సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (149 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (14) ఎక్కువసేపు నిలువలేకపోగా... పతుమ్ నిషాంక (8), దినేశ్ చండిమాల్ (12), కమిందు మెండిస్ (14), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (23) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో మాథ్యూ కునేమన్, నాథన్ లియోన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వెబ్‌స్టెర్ రెండు వికెట్లు సాధించాడు.
ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగుల భారీ స్కోర్ చేయగా..శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కునేమన్, నాథన్ లియోన్ సత్తాచాటారు. రెండు ఇన్నింగ్స్‌ల కలిపి కునేమన్, లియోన్ చెరో ఏడు వికెట్లు పడగొట్టారు.
కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌ను ఓడించి ఆసీస్ తమ డబ్ల్యూటీసీ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్11 నుంచి జూన్ 15 వరకు లార్డ్స్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో కంగారులు తలపడనున్నారు.
చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment