దిల్షాన్ అదుర్స్ | Sri Lanka’a Tillakaratne Dilshan too strong for Afghanistan in World T20 | Sakshi
Sakshi News home page

దిల్షాన్ అదుర్స్

Published Fri, Mar 18 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

దిల్షాన్ అదుర్స్

దిల్షాన్ అదుర్స్

కోల్‌కతా: ఇటీవలి వరుస పరాజయాలకు చెక్ పెడుతూ శ్రీలంక జట్టు తమ టి20 ప్రపంచకప్‌ను గెలుపుతో ఆరంభించింది. ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుని చివరికంటా క్రీజులో నిలవడంతో గురువారం అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్-1లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది.

ఆరంభంలో త్వరగా వికెట్లు పడినా కెప్టెన్ అస్ఘర్ స్టానిక్‌జాయ్ (47 బంతుల్లో 62; 3 ఫోర్లు; 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సమీయుల్లా (14 బంతుల్లో 31; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) సహకారం అందించాడు. పెరీరాకు మూడు వికెట్లు, హెరాత్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన లంక 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 155 పరుగులు చేసింది. మాథ్యూస్ (10 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) చివర్లో మెరిశాడు. నబీ, రషీద్‌లకు చెరో వికెట్ దక్కింది.

స్కోరు వివరాలు
అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షహజాద్ (సి) చమీర (బి) మాథ్యూస్ 8; నూర్ అలీ (బి) హెరాత్ 20; అస్ఘర్ (సి) చండిమాల్ (బి) పెరీరా 62; కరీమ్ (సి) చండిమాల్ (బి) పెరీరా 0; నబీ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 3; సమీయుల్లా (సి) పెరీరా (బి) కులశేఖర 31; షఫీకుల్లా (సి) తిరిమన్నె (బి) పెరీరా 5; దావ్లత్ నాటౌట్ 5; నజీబుల్లా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 153.
 వికెట్ల పతనం: 1-12, 2-44, 3-46, 4-51, 5-112, 6-132, 7-136.

బౌలింగ్: మాథ్యూస్ 3-0-17-1; కులశేఖర 4-0-43-1; చమీర 4-0-19-0; హెరాత్ 4-0-24-2; పెరీరా 4-0-33-3; సిరివర్ధన 1-0-16-0.

శ్రీలంక ఇన్నింగ్స్: చండిమాల్ (సి) సమీయుల్లా (బి) నబీ 18; దిల్షాన్ నాటౌట్ 83; తిరిమన్నె (బి) రషీద్ ఖాన్ 6; పెరీరా (రనౌట్) 12; కపుగెడెర (రనౌట్) 10; మాథ్యూస్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1-41, 2-58, 3-85, 4-113.
బౌలింగ్: కరీమ్ సాదిఖ్ 2-0-21-0; హమీద్ హసన్ 3.5-0-38-0; దవ్లత్ జద్రాన్ 3-0-31-0; నబీ 4-1-25-1; రషీద్ ఖాన్ 4-0-27-1; సమీయుల్లా 2-0-9-0.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement