Asghar stanikzai
-
‘టీమిండియా కంటే మా స్పిన్నర్లే అత్యుత్తమం’
బెంగళూరు: ‘మేము భారత్‌తో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ విరాట్ కోహ్లితో ఒక్కడితోనే ఆడటానికి కాదు’ అని గత నెల్లో వ్యాఖ్యానించిన అప్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అస్గార్ స్టానిక్జాయ్.. తాజాగా భారత్ స్పిన్ విభాగానికి కంటే తమ స్పిన్నర్లే అత్యుత్తమం అంటూ మరో పల్లవి అందుకున్నాడు. తమ స్పిన్ విభాగం భారత స్పిన్ డిపార్ట్మెంట్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు. ‘ మా స్పిన్ బలమేమిటో ప్రపంచం మొత్తానికి తెలుసు. రషీద్ ఖాన్, ముజీబ్ నబీ, రహ్మత్ షా, జహీర్ ఖాన్లు మా స్పిన్ బలం. మా యువ క్రికెటర్లలో ఎక్కువ మంది స్పిన్నర్లే ఉన్నారు. ఎందుకంటే వారంతా రషీద్‌ను, నబీని ఫాలో అవుతున్నారు. దాంతో మాకు స్పిన్ బలమే అధికమని చెప్పగలను. ఓవరాల్‌గా స్పిన్ విభాగంలో భారత్ కంటే మేము పటిష్టంగా ఉన్నాం’ అని అస్గార్ స్టానిక్జాయ్ తెలిపాడు. గురువారం నుంచి భారత్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరుగునుంది. ఇది అఫ్గానిస్తాన్‌కు తొలి టెస్టు కాగా, భారత్ టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ టెస్టు మ్యాచ్‌కు విరాట్ కోహ్లి దూరం కావడంతో అజింక్యా రహానే సారథిగా వ్యవహరించనున్నాడు. -
భారత్‌తో ఆడుతాం.. కోహ్లితో కాదు
ముంబై : భారత్‌తో చారిత్రత్మక టెస్టుకు తమ జట్టు సిద్దంగా ఉందని అఫ్గానిస్తాన్ కెప్టెన్ అస్గార్ స్టానిక్జాయ్ తెలిపాడు. ఈ చారిత్రత్మక టెస్టుకు టీమిండియా కెప్టెన్ కోహ్లి దూరం కావడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. అఫ్గాన్‌తో టెస్టుకు కోహ్లి దూరం కావడంపై విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్గార్ స్పందించాడు. తాము భారత్‌తో ఆడటానికి సిద్దంగా ఉన్నామని, కోహ్లి ఒక్కడితో ఆడటానికి కాదని పేర్కొన్నాడు. ‘‘ భారత ఆటగాళ్లందరూ.. కోహ్లి సామర్థ్యానికి సమానులే. మేం భారత్‌తో ఆడుతాం. కానీ కోహ్లితో కాదు.’ అని తెలిపాడు. భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని, ఇది తమకు కలిసొచ్చే అంశమని అస్గార్ అభిప్రాయపడ్డాడు. ‘‘ భారత పరిస్థితులు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. అదృష్టవశాత్తు మా జట్టులో మంచి స్పిన్నర్లున్నారు. రషీద్, ముజీబ్‌ల ప్రదర్శన మేం గర్వించేలా ఉంది. మా బ్యాట్స్‌మన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మూడు, నాలుగేళ్లుగా మా జట్టు సమన్వయం బాగుంది. మేం మంచి క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తాం.’’ అని తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటన దృష్ట్యా కోహ్లి కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్తుండటంతో చారిత్రత్మక టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా జరిగే ఈ టెస్టు అఫ్గాన్‌కు తొలి అంతర్జాతీయ టెస్టు. కోహ్లి గైర్హాజరితో అజింక్యా రహానే టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. -
దిల్షాన్ అదుర్స్
కోల్‌కతా: ఇటీవలి వరుస పరాజయాలకు చెక్ పెడుతూ శ్రీలంక జట్టు తమ టి20 ప్రపంచకప్‌ను గెలుపుతో ఆరంభించింది. ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుని చివరికంటా క్రీజులో నిలవడంతో గురువారం అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్-1లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆరంభంలో త్వరగా వికెట్లు పడినా కెప్టెన్ అస్ఘర్ స్టానిక్జాయ్ (47 బంతుల్లో 62; 3 ఫోర్లు; 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సమీయుల్లా (14 బంతుల్లో 31; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) సహకారం అందించాడు. పెరీరాకు మూడు వికెట్లు, హెరాత్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన లంక 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 155 పరుగులు చేసింది. మాథ్యూస్ (10 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) చివర్లో మెరిశాడు. నబీ, రషీద్‌లకు చెరో వికెట్ దక్కింది. స్కోరు వివరాలు అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షహజాద్ (సి) చమీర (బి) మాథ్యూస్ 8; నూర్ అలీ (బి) హెరాత్ 20; అస్ఘర్ (సి) చండిమాల్ (బి) పెరీరా 62; కరీమ్ (సి) చండిమాల్ (బి) పెరీరా 0; నబీ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 3; సమీయుల్లా (సి) పెరీరా (బి) కులశేఖర 31; షఫీకుల్లా (సి) తిరిమన్నె (బి) పెరీరా 5; దావ్లత్ నాటౌట్ 5; నజీబుల్లా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-12, 2-44, 3-46, 4-51, 5-112, 6-132, 7-136. బౌలింగ్: మాథ్యూస్ 3-0-17-1; కులశేఖర 4-0-43-1; చమీర 4-0-19-0; హెరాత్ 4-0-24-2; పెరీరా 4-0-33-3; సిరివర్ధన 1-0-16-0. శ్రీలంక ఇన్నింగ్స్: చండిమాల్ (సి) సమీయుల్లా (బి) నబీ 18; దిల్షాన్ నాటౌట్ 83; తిరిమన్నె (బి) రషీద్ ఖాన్ 6; పెరీరా (రనౌట్) 12; కపుగెడెర (రనౌట్) 10; మాథ్యూస్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-41, 2-58, 3-85, 4-113. బౌలింగ్: కరీమ్ సాదిఖ్ 2-0-21-0; హమీద్ హసన్ 3.5-0-38-0; దవ్లత్ జద్రాన్ 3-0-31-0; నబీ 4-1-25-1; రషీద్ ఖాన్ 4-0-27-1; సమీయుల్లా 2-0-9-0.