బెంగళూరు: ‘మేము భారత్‌తో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ విరాట్ కోహ్లితో ఒక్కడితోనే ఆడటానికి కాదు’ అని గత నెల్లో వ్యాఖ్యానించిన అప్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అస్గార్ స్టానిక్‌జాయ్.. తాజాగా భారత్ స్పిన్ విభాగానికి కంటే తమ స్పిన్నర్లే అత్యుత్తమం అంటూ మరో పల్లవి అందుకున్నాడు. తమ స్పిన్ విభాగం భారత స్పిన్ డిపార్ట్‌మెంట్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు. ‘ మా స్పిన్ బలమేమిటో ప్రపంచం మొత్తానికి తెలుసు. రషీద్ ఖాన్, ముజీబ్ నబీ, రహ్మత్ షా, జహీర్ ఖాన్‌లు మా స్పిన్ బలం.
మా యువ క్రికెటర్లలో ఎక్కువ మంది స్పిన్నర్లే ఉన్నారు. ఎందుకంటే వారంతా రషీద్‌ను, నబీని ఫాలో అవుతున్నారు. దాంతో మాకు స్పిన్ బలమే అధికమని చెప్పగలను. ఓవరాల్‌గా స్పిన్ విభాగంలో భారత్ కంటే మేము పటిష్టంగా ఉన్నాం’ అని అస్గార్ స్టానిక్‌జాయ్ తెలిపాడు. గురువారం నుంచి భారత్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరుగునుంది. ఇది అఫ్గానిస్తాన్‌కు తొలి టెస్టు కాగా, భారత్ టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ టెస్టు మ్యాచ్‌కు విరాట్ కోహ్లి దూరం కావడంతో అజింక్యా రహానే సారథిగా వ్యవహరించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment